2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీలో పెద్ద పెద్ద తోపులనుకునే నేతలందరూ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అసలు జీవితంలో ఓటమి ఎరుగని నేతలు సైతం జగన్ గాలిలో కొట్టుకుపోయారు. ఉదాహరణకు అసలు ఓటమి తెలియని దేవినేని ఉమా, ధూళిపాళ్ళ నరేంద్రలు దారుణంగా ఓడిపోయారు. ఇక ఆ విషయాన్ని పక్కనబెడితే ఓడిపోయాక కూడా చాలామంది నేతలు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. అసలు పార్టీలో యాక్టివ్‌గా కనిపించడం లేదు.

 

ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కువ సీట్లు ఉన్న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడ పార్లమెంట్ నేతలు కంటికి కనబడట్లేదు. అసలు రాజమండ్రిలో టీడీపీ సీనియర్ నేత మురళీమోహన్ ఎన్నికల ముందే చేతులెత్తేసిన విషయం తెలిసిందే. 2009లో ఉండవల్లి చేతిలో స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయిన మురళీమోహన్...2014 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి భారీ మెజారిటీతో గెలిచేశారు. ఆ ఐదేళ్లు ఎంపీగా మంచి పనితీరే కనబర్చారు.

 

అయితే ఏమైందో తెలియదు గానీ...2019 ఎన్నికల్లో మాత్రం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి, రాజకీయాల నుంచి సైడ్ అయిపోయారు. కానీ చంద్రబాబు మాత్రం...మురళీమోహన్ కోడలు మాగంటి రూపాదేవిని బరిలోకి దించారు. అప్పటికప్పుడు పోటీలో ఉండటం, రాష్ట్రం మొత్తం జగన్ గాలి ఉండటంతో రాజమండ్రిలో వైసీపీ అభ్యర్ధి మార్గాని భరత్ అదిరిపోయే మెజారిటీతో గెలిచారు. భారీ ఓటమి దెబ్బకు రూపాదేవి మళ్ళీ అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు.

 

దీంతో రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో టీడీపీకి దిక్కులేకుండా పోయింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో రూపాదేవి కూడా సైడ్ అయిపోతారని తెలుస్తోంది.  ఇదే సమయంలో కాకినాడలో ఓటమి పాలైన టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ కూడా కంటికి కనబడట్లేదు. ఆయన తక్కువ మెజారిటీతోనే ఓడిపోయినా సరే...పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదు. ఎన్నికలయ్యాక ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. దీంతో కాకినాడలో కూడా టీడీపీకి దిక్కులేకుండా అయిపోయింది. మొత్తానికైతే రాజమండ్రి, కాకినాడల్లో టీడీపీ చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: