పిల్లలు ఎక్కువ శాతం ఆడడానికి చాలా ఇష్టపడతారు. ఇక పిల్లలకు చాలా ఇష్టమైన ఆటలలో జారుడు బండలా ఆట. అలా పిల్లలు సరదాగా ఆడుకునేది ఎవరైనా చూస్తే... వాళ్ల బాల్యంలో చేసిన అల్లర్లు గుర్తుకురావడం సహజం. మరి కొందరు అయితే పిల్లలను పక్కకు నెట్టి మరి వారు ఆట ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ఆట కేవలం మనుషులకు మాత్రమే కాదు. మనుషులు అయినా జంతువులు అయినా పిల్లలు పిల్లలే ఎవరు ఎంజాయ్ మెంట్, ఎవరి సంతోషం వారికి ఉంటుంది. 

 

 


ఇక తాజాగా ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియా వేదికగా చేసుకొని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వీడియోను షేర్ చేసిన సంఘటన గురించి ఇది అంతా.  ఆ వీడియోలో ఏమి ఉందన్న విషయానికి వస్తే... ఒక చిన్న ఏనుగు పైనుంచి కిందకు జారుతూ.. మళ్లీ పైకి వెళ్లి మళ్లీ జారుతుంది. ఇక ప్రకృతిని ఆస్వాదించాలన్న అనుకునేవారికి ఆడుకోవడానికి ఎలాంటి పరికరాలు కూడా అవసరం లేదు అంటే ఇదేనేమో. ప్రతి దాన్ని కూడా వాళ్ళ అవసరానికి మార్చుకుంటూ ఉంటారు కొందరు. 

 

 


ఈ వీడియో కూడా అలానే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా హల్ చల్ చేస్తోంది. ఇక ఈ వీడియో ఒక నెటిజన్ జారుడు ఆటను ఎంజాయ్ చేయటం చిన్నపిల్లల జీన్స్ లోనే ఉంటుంది అని కామెంట్ పెట్టగా మరొకరు... తాను వచ్చే జన్మలో ఒక ఏనుగు పుట్టాలి అనుకుంటున్నాను అని మరొక నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: