వైకాపా అధికారంలోకి వచ్చాక ఎక్కువగా విపక్షాల కంటే న్యాయస్థానాలలో గట్టిగా ఎదురు దెబ్బలు తగిలాయి. చాలా విషయాలలో హైకోర్టులో జగన్ తీసుకున్న నిర్ణయాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడం జరిగాయి. దాదాపు 60 కి పైగానే హైకోర్టు జగన్ సర్కార్ కి చాలా విషయాల్లో మొట్టికాయలు వెయ్యడం జరిగింది. దీంతో పెద్దఎత్తున వైసీపీ ప్రజా ప్రతినిధులలో చాలామంది హైకోర్టు వ్యవస్థ కొంత మంది రాజకీయ నాయకులు బందీ అయిపోయింది అనే భావన ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల మద్యం అక్రమ రవాణా విషయంలో స్వయంగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ని స్థానానికి వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పటం ఆయన వెళ్లి వివరణ ఇవ్వటం అందరికీ తెలిసిందే.

 

ఈ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వైకాపాలో సంతోషాన్ని కలిగించే విధంగా మారాయి. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే…‘ ఏ వ్యక్తికి, అధికారికి, ఏ ప్రభుత్వానికి న్యాయస్థానం వ్యతిరేకం కాదు. కరోనా సమయంలో పోలీసులు చక్కగా సేవలందిస్తున్నారు. న్యాయ సలహాదారులు తగిన విధంగా సహకరించకపోవడం వల్లే కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. కొందరు ప్రభుత్వానికి న్యాయస్థానం వ్యతిరేకమా? అనే భావనలో ఉన్నారు. కోర్టులున్నది రాజ్యాంగ, చట్ట నిబంధనల రక్షణ కోసమే. ప్రభుత్వానికి సక్రమమైన సలహాలు, సూచనలు చేయకుండా కోర్టులను నిందిస్తే ప్రయోజనముండదు’ అని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

 

మొత్తం మ్మీద జగన్ సర్కార్ లో ప్రభుత్వ సలహాదారుల విషయంలో అదేవిధంగా న్యాయసలహాదారుల విషయంలో తప్పు చేయటం వల్లే న్యాయస్థానాలలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విగిపోతున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వం సరిగ్గా పరిపాలన అందించకుంటే ఖచ్చితంగా న్యాయస్థానాలు కలుగజేసుకోవటం జరుగుతుందని స్పష్టం చేసినట్టుగా హైకోర్టు తెలిపింది. దీంతో వైసీపీ మద్దతుదారులు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వ సలహాదారుల విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో అన్న భావన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: