నేడు దేశీయ మార్కెట్ మళ్లీ నష్టపోయింది. బెంచ్ మార్కు సూచీలు రెండో రోజు కూడా నష్టపోయాయి. ఇకపోతే రోజు మొత్తం తీవ్ర ఒడిదుడుకులకు లోనై చివరకు నష్టాల్లోనే ముగిసింది. దీనికి ప్రధాన కారణం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ జూన్ నెల అని తెలపడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇక నేడు ఇంట్రాడేలో సెన్సెక్స్ 582 పాయింట్లు కడలడగా, నిఫ్టీ కూడా 10194 పాయింట్ల దిగువకు చేరుకుంది. ఇక రోజు ముగిసేసరికి సెన్సెక్స్ 27 పాయింట్ల నష్టం తో 34842 పాయింట్ల వద్ద, అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 10289 వద్ద ట్రేడ్ ముగిసింది.

 

IHG

 


ఇక నేడు నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయాన్ని చూస్తే... బజాజ్ ఫైనాన్స్, mahindra BANK' target='_blank' title='కొటక్ మహీంద్రా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కొటక్ మహీంద్రా, హీరో మోటొకార్ప్, గెయిల్, ఐటిసి సంస్థలు లాభాల బాట నడవగా ఇందులో ఐటీసీ సంస్థ షేర్లు ఆరు శాతం పైన లాభపడింది. ఇక మరోవైపు ఐఓసి, ఐషర్ మోటార్స్, హెచ్సిఎల్, ఏషియన్ పెయింట్స్, హిందాల్కో కంపెనీ షేర్లు నష్టాలతో ముగిసాయి. ఇందులో ఏషియన్ పెయింట్స్ ఏకంగా మూడు శాతం పైగా నష్టపోయింది.

 

IHG


ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు విషయానికి వస్తే బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ కు 0.8% తగ్గి 39.9 5 డాలర్లకు చేరుకుంది. మరోవైపు WTA ముడి చమురు ధర బ్యారెల్ కు 1.37 శాతం నష్టపోయి 37.4 8 డాలర్లకు చేరుకుంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి మారకపు విలువ 7 పైసలు లాభపడి 75.65 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: