ఏపీ అధికార పార్టీ వైకాపాలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. ముందు నుండి పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఓ వర్గం మీడియా చానల్స్ కి ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ఇంటర్వ్యూ ఇస్తూ రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని ఎప్పటినుండో ఏపీ రాజకీయాల్లో వార్తలు అందుతున్నాయి. అంతే కాకుండా ఇటీవల ఏకంగా సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలపై మీడియా సమక్షంలో అవినీతి ఆరోపణలు రఘురామకృష్ణంరాజు చేయడం సంచలనంగా మారింది. దీంతో తాజాగా వైకాపా అధిష్ఠానం రఘురామకృష్ణంరాజు షోకాజ్ నోటీసులు అందజేయడం జరిగింది.

 

గతంలో తాను వైయస్ జగన్ బతిమిలాడితే తప్ప వైకాపాలో చేరలేదని చెబుతూ తన గెలుపు కి తానే బాధ్యుడిని అని రఘురామకృష్ణంరాజు గొప్పలు చెప్పుకొన్నారు. అంతే కాకుండా మధ్యమధ్యలో వైయస్ జగన్ పై సెటైర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు షోకాజ్ నోటీసులు ఇచ్చిన  తర్వాత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… పార్టీలో ఉన్న ఏ ఎంపీకి ఇవ్వని గౌరవం రఘురామకృష్ణంరాజు కి జగన్ ఇచ్చారని తెలిపారు.

 

ఎవరైనా ఇప్పుడు ప్రజాప్రతినిధులు పార్టీలో ఉన్నారంటే దాని వెనకాల వైయస్ జగన్ కృషి ఉందని, ఆయనవల్లే ఆయన పడిన కష్టం వల్లే ఈ విధమైన మెజార్టీ వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఇలానే ఉంటుందని విజయసాయిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు . దీంతో రఘురామకృష్ణంరాజు వివరణ ఇచ్చే టైంలో విజయసాయిరెడ్డి ప్రస్తావన తీసుకురావాలని, ఆయనే వైయస్ జగన్ జుట్టు కొట్టరి కట్టించినట్లు పార్టీ ప్రజాప్రతినిధులకు తెలిసేవిధంగా రఘురామకృష్ణంరాజు వివరణ ఇచ్చే టైం లో వ్యాఖ్యలు చేయాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో పార్టీకి రఘురామకృష్ణంరాజు ఎలాంటి వివరణ ఇస్తారు అన్నది అసలు ఏ విషయాలు లేవనెత్తుతాడో అన్నది పార్టీలో సస్పెన్స్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: