తెలంగాణలో కరోనా విలయ తాండవం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈమహమ్మారి దాటికి హైదరాబాద్ నగరం వణికిపోతుంది. ప్రతి రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు టెస్టులు సంఖ్య పెద్దగా పెరగలేదు అయినా కానీ భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తుంది. మొదటి నుంచే ఎక్కువ టెస్టులు చేస్తే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది ఇప్పుడు కాంటాక్ట్ కేసులు ఎక్కువకావడంతో ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
 
నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 920 కేసులు నమోదు కాగా అత్యధికంగా జిహెచ్ఎంసి లో 737 రంగారెడ్డిలో 86. మేడ్చల్ లో 60,కరీంనగర్ లో13 కేసులు నమోదయ్యాయి నిన్న మొత్తం 3616 శాంపిల్ టెస్టులు జరిగాయి. ఇక ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 11364 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 4688మంది బాధితులు కోలుకోగా ప్రస్తుతం 6446కేసులు యాక్టీవ్ గా వున్నాయి. నిన్న రాష్ట్రం లో కరోనాతో 5గురు మరణించడంతో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 230కి  చేరింది. 
మరోవైపు దేశవ్యాప్తంగా కూడా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే 18000కుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 491000కు దాటగా 15000 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇదిలావుంటే దేశంలో అత్యధిక కరోనా టెస్టులు చేసిన మొదటి రాష్ట్రంగా తమిళనాడు రికార్డు సృష్టించింది. ఆరాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 10లక్షలు దాటింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: