దేశంలో ఊహించనివిధంగా కరోనా వైరస్ విజృంభణ జరుగుతున్న తరుణంలో అటు కేంద్రంలోనూ వైద్యుల లోనూ టెన్షన్ మొదలైంది. ఏకంగా రాజకీయ నాయకులకు మరియు పోలీసులకు చికిత్స అందజేస్తున్న వైద్యులకు కూడా కరోనా వైరస్ సోకుతున్న నేపథ్యంలో ఏం చేయలేని పరిస్థితి అంతటా నెలకొంది. లాక్‌డౌన్‌ తర్వాత ఉన్న కొద్ది వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో కేంద్రంలో కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

 

మరోసారి లాక్ డౌన్ అమలు చేయాలని ఒక పక్క ఒత్తిళ్లు వస్తున్న తిరిగే ఆర్ధికరంగం కోలుకోవడం కష్టమని ... భావిస్తున్నారు. ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు కరోనా వైరస్ అంటే భయపడ్డారు గాని, భారతీయులు మాత్రం వైరస్ అంటే భయం లేకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే ఈ వైరస్ పాజిటివ్ కేసులు బయటపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

ఒకపక్క మెడిసిన్ వచ్చిందని మీడియా అంటున్నా కానీ అవి ఏమాత్రం రోగి పై ప్రభావితం చేస్తుంది అన్న దానిపై స్పష్టత రాలేదు. ఇటువంటి తరుణంలో ఉన్న కొద్దీ పాజిటివ్ కేసులు దేశంలో బయట పడుతున్న నేపథ్యం రైల్వేశాఖ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 12వరకు దేశంలో రెగ్యులర్ రైళ్లను రద్దు చేస్తునట్టు ప్రకటించింది. సాధారణ, ఎక్స్ ప్రెస్, సబర్బన్ రైళ్లను రద్దు చేస్తున్నామని తెలిపింది. జులై 1 నుండి ఆగస్టు 12 వరకు బుకింగ్ చేసుకున్న వారి టికెట్స్ రద్దు చేస్తునట్టు పేర్కొంది.  టికెట్ ను రద్దు చేసి పూర్తి డబ్బులను రిఫండ్ చేస్తామని పేర్కొంది.  ఇక ప్రస్తుతం నడుపుతున్న 230 ప్రత్యేక రైళ్లను యధావిధిగా నడుపుతామని ప్రకటించింది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: