కరోనా పేరుకు చిన్నదే గానీ ప్రపంచ దేశాలనే తన గుప్పిట పెట్టుకుని ఒక ఆట ఆడిస్తున్నది.. తన పుట్టినిల్లు అయినా చైనా నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి నంగనాచిలా ఇదేదో చిన్న రోగం అనిపించేలా ప్రవేశించింది.. అప్పటికి మనవారు దీనిపట్ల ఎక్కువగా శ్రద్ధ కనబరచలేదు.. ఆ ఏముంది ఒక పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందని భావించారు..

 

 

కానీ మనదేశంలో అడుగుపెట్టి ఇన్ని నెలలు అయినా ఇది బలహీన పడకపోగా రోజు రోజుకు తన ఖాతాదారుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లుతుంది.. ఇదివరకు ఈ వైరస్ ప్రపంచ దేశాల్లో విజృంభిస్తున్న తీరుకు మనం భయపడ్డాం.. కానీ ఇప్పుడు మన దేశంలో దీని ప్రతాపాన్ని చూసి మిగతా దేశాల వారు ఆశ్చర్య పోయే స్దితిలోకి వెళ్లాం.. ఇకపోతే ఇప్పుడున్న పరిస్దితుల్లో పల్లెటూళ్లకంటే, గ్రామాలకంటే నగరాలే చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి.. కరోనా వైరస్‌కు అడ్డాగా మిగులుతున్నాయి.. అందుకు మన దేశంలోని ముఖ్యనగరాలే ఉదాహరణ..

 

 

అందులో ప్రస్తుతం ముంబై, ఢిల్లీ నగరాల్లో కరోనా విజృంభణ ఊహించని స్దాయిలో ఉంది.. ఇక ముంబై నగరంలో  గురువారం రాత్రి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 69,528. అయితే, ఢిల్లీలో 70,390 కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ముంబై టాప్ లిస్ట్ లో ఉండగా ఇప్పుడు ఢిల్లీ మొదటి స్థానానికి చేరింది. ఇక ఢిల్లీ జులై మొదటి వారంలో ముంబై నగరాన్ని దాటేస్తుందని అనుకున్నా, వారం ముందుగానే దాటెయ్యడంతో ఆరోగ్య శాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది..

 

 

ఇక తాజా  సమాచారం ప్రకారం ఇండియాలో గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 18 వేల మార్క్ దాటి పోయినట్టు తెలుస్తోంది. అందులో నాలుగు వందలకు పైగా మరణాలు సంభవించినట్టు సమాచారం. మొత్తానికి మన నగరాలు ప్రమాదకర స్దితిలోకి జారుతున్నాయని తెలుస్తుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: