ప్రజలు ఇప్పటి వరకు చూడని ప్రపంచాన్ని కరోనా వైరస్ చూపిస్తుందనడంలో సందేహం లేదు.. ఎందుకంటే పొరపాటునా తుమ్మినా, దగ్గినా అనుమానంగా చూస్తున్నారు.. ఎవరిని నమ్మలేని స్దితిలో బ్రతకవలసి వస్తుంది.. దీనికంతటికి కారణం కరోనా.. ఈ పేరు వినిపించినంతగా, ప్రజల్లో భయం కనిపించడం లేదు.. బాధ్యత కనిపించడం లేదు.. నాకేం కాదు అని అనుకుంటూనే ఈ వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణం అవుతున్నారు..

 

 

ఇకపోతే కరోనా ఎలా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుందో తెలియకుండా దొంగదెబ్బ తీస్తుంది.. ఇప్పటికే దీని వ్యాప్తికి ఉన్న మార్గాలను చాలా వరకు తెలుసుకున్నాము.. అయితే తాజాగా మాస్కులను తయారు చేసే కంపెనీలోని ఉద్యోగులకు కూడా ఈ కరోనా వచ్చిందట.. మరి ఆ మాస్కులను వాడిన వారి పరిస్దితి ఏంటి.. తలుచుకుంటేనే ఏదోలా ఉంది.. అదీగాకా కరోనా వచ్చినప్పటి నుండి, మనుషులకు ముఖ్యమైన వస్తువుల్లో ఫేస్ మాస్క్, శానిటైజర్స్ ప్రధానంగా మారాయి.. ఇక వీటిలో నకిలీ శానిటైజర్స్ వల్ల కలిగే హాని గురించి తెలిసిందే.. ఇలాంటి పరిస్దితుల్లో మాస్కులు తయారు చేసే వారు కూడా కరోనా బారిన పడితే అవి వాడిన వారికి కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుంది.. ఇప్పుడు ప్రజలకు కరోనా నుండి అన్ని దారుల్లో ప్రమాదం అని తెలుస్తుంది.

 

 

ఇక కేంద్ర పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిలో మాస్కులు త‌యారు చేసే యూనిట్‌లో ప‌నిచేసే 40 మందికి క‌రోనా సోకింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఆ ఫ్యాక్ట‌రీలో ప‌ని చేసిన‌ 70 మందికి క‌రోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింద‌ని అధికారులు పేర్కొన్నారు..ఇక ముఖ్య‌మంత్రి వి.నారాయ‌ణ‌స్వామి ఈ ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనికి కార‌ణ‌మైన స‌ద‌రు ప్లాంట్‌ను వెంట‌నే సీల్ చేయాలి అని అధికారుల‌ను ఆదేశించారు. ఇదిలా ఉండగా  అధికారులు వైర‌స్ సోకిన కార్మికులు ఫ్యాక్ట‌రీకి ఏయే గ్రామాల నుంచి వ‌స్తారో అని ఆరా తీస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: