కొత్త కారు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరికి ఆశగా ఉంటుంది. ఇక రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎంతో ముచ్చటగా కొనుక్కున్న కారు ఇరవై నిమిషాలకే నుజ్జు నుజ్జు అయిన కారు చూస్తే గుండె పగిలి పోవడం ఖాయం. సరిగ్గా బ్రిటన్ లోని వైట్ ఫీల్డ్ లో కూడా ఇదే సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి రెండు కోట్ల రూపాయల విలువైన గ్రే కలర్ లంబోర్గిని హరికేన్ స్పైడర్ మోడల్ కారును చాలా ఇష్టపడి కొనుగోలు చేశాడు. ఇక కారు తాళాలు అందుకున్న వెంటనే అతను చాలా ఆనంద పరవశం అయిపోయాడు. ఇక ఆనందంలో కారును స్టార్ట్ చేసి కొంత దూరం ప్రయాణం చేసిన అనంతరం కారులో సాంకేతిక లోపాలు రావడంతో రోడ్డుపై ఆగిపోయింది.

 

 


దీనితో ఏమయిందో అని తెలుసుకుందామని ఒకసారి కారు నుంచి కిందికి దిగాడు. ఇక అప్పుడే జరగరాని ఘోరం జరిగిపోయింది. అతడు కిందికి దిగిన వెంటనే మరో కారు ఈ లంబోర్గిని కారును బలంగా ఢీ కొట్టడం జరిగింది. దీనితో కారు వెనక బాగా పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. ఇక ఆ వ్యక్తి కారు కొన్న 20 నిమిషాల్లోనే ఇలా అవ్వడంతో అప్పుడు వరకు ఆనందించిన ఆనందం మొత్తం ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఇక ఈ ప్రమాదానికి గురైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా చేసుకొని పోలీస్ అధికారులు ' ఏడ్చిన కారు ఏదైనా ఉందంటే అది ఇదే ’ అని ట్వీట్ చేసారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారి చక్కర్లు కొడుతుంది. ఇక మరికొందరు నెటిజన్లు అయితే యజమాని దురదృష్టమని జాలిపడుతూ కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: