ఆంధ్రప్రదేశ్ లో కరోనా వల్ల విధింపబడిన లాక్ డౌన్ ఎన్నో విచిత్ర పరిణామాలకు దారితీసింది. ఇప్పటికే దీనివల్ల 10 మరియు ఇంటర్ విద్యార్థుల పరీక్షలు రద్దు కాగా డిగ్రీ మరియు పిజి విద్యార్థుల పరీక్షలు కూడా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏడాది మొదట్లో గ్రామ మరియు వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందుకు సంబంధించి ఏపీ పంచాయతీ రాజ్ నుండి గుడ్ న్యూస్ అందించింది.

 

వివరాల్లోకి వెళితే ఏపీ లోని గ్రామ వార్డు సచివాలయం లో ఖాళీగా ఉన్న 16,208 పరీక్షలను ఆగస్టులో నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.  అయితే ఇలాంటి సమయంలో లాక్ డౌన్ వల్ల సొంతూర్లకు వెళ్ళిన అభ్యర్థులు.... వారు ఉంటున్న చోట పరీక్ష కేంద్రాలను మార్చుకునే వెసులుబాటును కల్పించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు వేరే ప్రాంతాలకు వెళ్ళి పరీక్ష రాసే అవకాశం లేకపోవడంతో పంచాయతీరాజ్ ఎగ్జామ్ సెంటర్లను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

 

పరీక్ష కేంద్రాలను మార్చుకోవాలనుకునే అభ్యర్థులు ఇవాళ ఉదయం 11 నుంచి జూలై 2 తేదీ సాయంత్రం 5 గంటల లోగా ఎగ్జామ్ సెంటర్లు మార్చుకోవచ్చని తెలిపింది. కాగా 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: