కరోనా వైరస్.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో లక్షలమందిని బలి తీసుకున్న ఈ కరోనా వైరస్ నియంత్రించేందుకు లాక్ డౌన్ అమలు చేసినప్పటికీ సరైన ఫలితం లేకుండా పోయింది. ఇంకా ఈ కరోనా వైరస్ ని అంతం చేసేందుకు ఎంతోమంది ఎన్నో చిట్కాలు చెప్తున్నారు. 

 

హెర్బల్ టీ అని ఒకరు.. ఉల్లిపాయ టీ అని ఒకరు.. ఉప్పు నీళ్లు అని ఒకరు.. ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంటి చిట్కాలతో కరోనా వైరస్ మాయం అని అంటున్నారు.. అది ఎలా అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు బెంగాల్ పోలీసులు సరికొత్త ప‌ద్ద‌తుల‌ను క‌నుగొన్నారు. అది ఏంటి అంటే? ఆవ‌నూనె, నిమ్మకాయ క‌లిపి వేడినీళ్లు తీసుకోవ‌డం వ‌ల్ల కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకుంటామ‌ని ఉత్తర బెంగాల్‌లోని సిలిగురి పోలీస్ కమిషనరేట్ ప‌రిధిలోని ఉన్న‌తాధికారులు చెప్పుకొచ్చారు. 

 

ఈ చిట్కా ఎంతో మందికి మంచి చేస్తుంది అని అయన అన్నారు. ఇక మిగ‌తా అధికారులు, సిబ్బంది కూడా ఈ విధానాన్ని ఆచరిస్తే మంచిది అని చెప్పుకొచ్చారు. అయితే క‌మిష‌న‌రేట్‌లోని డిప్యూటీ పోలీస్ క‌మిష‌న‌ర్ బంధువు, ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ క‌రోనా బారిన‌ప‌డ‌గా వాళ్లు ఈ ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రించి త్వ‌ర‌గా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా అయ్యారు అని అధికారులు చెప్పారు. 

 

అయితే ఈ ఆవనూనె అందరికి అందుబాటులో ఉంటుంది అని.. దీన్ని నిమ్మరసంతో కలిపి ఆ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది అని అంటున్నారు. ఈ చిట్కాతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్తున్నారు. ఒక వారం రోజుల క్రితం డార్జిలింగ్ జంక్షన్ సమీపంలో ఉన్న పోలీసుకు, ఆయ‌న భార్య‌కు క‌రోనా పాజిటివ్ అని రాగ వారు ఈ చిట్కాలు పాటించారు అని.. దీంతో వాళ్లకు రెండు రోజుల్లోనే మెరుగైన ఆరోగ్యం సొంతం అయ్యింది అని పోలీస్ కమిషనర్ త్రిపురారీ ఆర్ధవ్ పేర్కొన్నారు. ఏది ఏమైనా పోలీసులు మంచి చిట్కాని ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: