మహిళా భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల ఆలోచనలు మాత్రం మారడం లేదు. దేశంలో ఎక్కడో ఒక్క చోట మహిళలు వేధింపులకు గురవుతానే ఉన్నారు. ఈ వేధింపులు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమస్య సామాన్య మహిళలే కాదు.. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి కూడా ఈ వేధింపులు తప్పడం లేదు.

 

 

ప్రేమ అనే నేపంతో చాల మంది అబ్బాయిలు అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. అయితే తాజాగా మరో ఘటన విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. సచివాలయ ఉద్యోగినిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు యువకుడు. అతను పెట్రోల్ పోసి సజీవ దహనం చేస్తానంటూ మహిళను బెదిరించిన ఘటన విశాఖ జిల్లా పెదబయలు మండలం గంపరాయి గ్రామంలో చోటు చేసుకుంది.

 

 

వివరాల్లోకి వెళ్తే.. అరఢకోట గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌‌గా పనిచేస్తున్న యువతిని అదే గ్రామానికి చెందిన ప్రశాంత్‌ అనే యువకుడు వేధిస్తున్నాడు. తనను ప్రేమించకపోతే అంతు చూస్తానంటూ అబ్బాయి బెదిరిస్తున్నాడు. గురువారం ఏకంగా ఆమె ఆఫీసుకే వెళ్లి బయటకు రావాలంటూ డిమాండ్ చేశాడు. తన ప్రేమను అంగీకరించకపోతే పెట్రోల్ పోసి దహనం చేస్తానని, ఎవరొచ్చి కాపాడతారో చూస్తానని బెదిరించాడు.

 

 

తాను విధుల్లో ఉన్నానని, ఇక్కడికొచ్చి గొడవ చేయడం మంచిది కాదని ఆమె చెప్పినా వినకుండా చేయి చేసుకున్నాడని తెలిపారు. దీంతో మిగతా సిబ్బంది ప్రశాంత్‌ను అడ్డుకుని అతనిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటనతో భయపడిపోయిన యువతి వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారమిచ్చింది. వారు వెంటనే అక్కడికి చేరుకుని కూతురిని ఇంటికి తీసుకెళ్లారు.

 

 

ప్రశాంత్‌ నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధితురాలు ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో పూర్ణయ్యకు ఫిర్యాదు చేసింది. తన కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు, ప్రశాంత్‌పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: