ఈఎస్ఐ స్కామ్ లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అతని ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో అరెస్ట్ అయిన దగ్గర నుండి హాస్పిటల్ లోనే ఉంటున్న అచ్చెన్నాయుడు ని హాస్పిటల్ లోనే విచారించవలసినదిగా కోర్టు వారు ఆదేశించారు. ఇక అచ్చెన్నాయుడు తరఫు న్యాయమూర్తి…. ఆయనను గవర్నమెంట్ ఆసుపత్రి నుండి కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసి ఏసీబీ అధికారులకు న్యాయవాదుల సమక్షంలో ఆసుపత్రిలోనే విచారణ జరిపేందుకు అనుమతినిచ్చారు.

 

ఇక ఏసీబీ విచారణలో అచ్చెన్నాయుడు ఒక కీలకమైన లాజిక్ ను మాట్లాడటం విశేషం. ఈఎస్ఐ మందులు కొనుగోలు, పరికరాల కొనుగోలు సమయంలో అతను మంత్రి గానే లేనని అచ్చెన్నాయుడు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు విషయం ఎలా ఉందో అధ్యయనం చేయాలని మాత్రమే సూచించామని మరియు మినిట్స్ ప్రతి పై మాత్రమే సంతకం చేశానని.... తనకు స్క్యామ్ కు ఎటువంటి సంబంధం లేదని వివరించారట. ఇక ఏసీబీ అధికారులు "మినిట్స్ లో టెలి హెల్త్ సర్వీసెస్ కొనుగోళ్లకు సంబంధించి టెండర్లను ఇవ్వమని ఒకే కంపెనీకి సిఫారసు చేశారా?" అని ప్రశ్నించారు.

 

అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే…. స్క్యామ్ జరిగే సమయంలో గాని కొనుగోళ్ల విషయంలో గాని అచ్చెన్నాయుడు మంత్రి గా లేనప్పుడు ఆయనకు అసలేం సంబంధం ఉన్నట్లు? టెక్నికల్ గా అతను కంపెనీని సిఫార్సు చేశాడు అంటే కేసు చాలా బలహీనపడిపోతోంది. అదీ కాకుండా ఆరోగ్య పరిస్థితి కూడా రోజురోజుకీ క్షీణిస్తుండడం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం. వీటన్నింటి మధ్య అచ్చెన్నయుడు కుటుంబసభ్యుల ఆస్తులు మరియు ఆదాయం గురించి వేసిన ప్రశ్నలు ఒక్కటే ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది.

 

ఇక అచ్చెన్నాయుడు ఇచ్చిన ప్రతి సమాధానంతో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ పైన షాక్ తగులుతుంది అనే చెప్పాలి. అతని మంత్రి గా లేనప్పుడు జరిగిన స్క్యామ్ కి సంబంధించి కేసు ఎవరు పెట్టారు మరియు అతని కావాలని ఇరికిస్తున్నారా అన్న సందేహాలు ప్రజల్లో ఉత్పన్నం కావడం మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: