ప్ర‌పంచాన్ని క‌మ్మేస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారి మ‌న‌దేశంలోనూ దారుణంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దేశంలో ఎన్నో హాట్ స్పాట్లు ఉన్నాయి. ఇవ‌న్నీ ఇలా ఉంటే మ‌న దేశంతో అతి పెద్ద క‌రోనా హాట్ స్పాట్లుగా వేశ్యా వాటిక‌లు మారే ప్ర‌మాదం ఉంద‌ని తాజా అధ్య‌య‌నాలు చెపుతున్నాయి. ఇప్ప‌టికిప్పుడు వేశ్యా వాటిక‌లు మూయ‌క‌పోతే దేశంలో క‌రోనా‌ విజృంభణ తారాస్థాయికి చేరుతుంది. 4 లక్షల మందికి పైగా వైరస్‌ సోకుతుంద‌ని.. వీరిలో 20 వేల మందికి పైగా మృత్యువాత ప‌డ‌తార‌ని కూడా ఈ అధ్య‌య‌నాలు చెపుతున్నాయి. యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, హా ర్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ విద్యావేత్తల అధ్యయనంలో వెల్లడైంది. 

 

వేశ్యా వాటిక‌లు మూసివేయ‌డం ద్వారా దేశంలో క‌రోనా వ్యాప్తిని60 శాతం వ‌ర‌కు కంట్రోల్ చేయ‌వ‌చ్చ‌ట‌. అలాగే తెలంగాణ‌లోని సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ వేశ్యావాటికను మరికొంత కాలం మూసేయడం ద్వారా కరోనా విజృంభణ, మరణాలను 25కు తగ్గించొచ్చని అంచనా వేశారు. తెలంగాణ‌లో క‌రోనా వ్యాప్తి ఎలా ఉందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ టైంలో సెక్స్ వ‌ర్క‌ర్ల ద్వారా ఈ వ్యాధి మ‌రింత పెరిగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 

 

వేశ్య‌ల‌తో సంభోగం జ‌రిపేట‌ప్పుడు ఈ వ్యాధి ఇత‌రుల‌కు వ్యాప్తి చెందుతుంద‌ని.. వారి నుంచి మ‌రి కొంత మందికి, కుటుంబ స‌భ్యుల‌కు వ‌స్తుంద‌ని ఈ అధ్య‌య‌న క‌ర్త‌లు చెపుతున్నారు. ప్రజ్ఞాపూర్ వేశ్యా వాటిక‌లో క‌రోనా సోకిన వారిని త‌క్కువ మందిని మాత్ర‌మే కాపాడే వీలుటుంద‌ని చెపుతున్నారు. అందుకే తెలంగాణలోనూ వేశ్యావాటికలు అతి పెద్ద హాట్‌స్పాట్‌లుగా నిలిచే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: