అదృష్టవంతుడిని ఎవ్వరూ చెడగొట్టలేరు.. దురదృష్టవంతుడిని ఎవ్వరూ బాగుపర్చలేరు.. ఈ సామెత గుర్తుందికదా.. చాలా అరుదుగా అదృష్టం కలిసి వచ్చినవారు ఉంటారు.  సాధారణంగా  లాటరీయో, గుప్త నిధులో దొరికి దెబ్బకు కోటీశ్వరులు అవుతున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా ఓ వ్యక్తి ఒక్క రాత్రి రాత్రికే కోటీశ్వరుడు అయ్యాడు.. కాకపోతే అతనికి లాటరీ, గుప్తనిధులు దొరకలేదు. రెండు పెద్ద రత్నాలను విక్రయించి ఒక్కసారిగా ఎవ్వరూ ఊహించనంత డబ్బుగల వ్యక్తిగా మారాడు.  ఈ సంఘటన టాంజానియాలో చోటు చేసుకుంది. లైజర్ అనే వ్యక్తి గనులు తవ్వుకుని జీవించే రోజూవారి కూలీ.  

 

ప్రతిరోజూ కష్టపడితే కానీ పూటగడవదు.  ఓ రోజు అతని అదృష్టం తలుపు తట్టింది.  లైజర్ గునులు తవ్వుతుండగా రెండు పెద్దసైజు రత్నాల రాళ్లు దొరికాయి.  వాటిలో మొదటి రత్నం బరువు 9.27 కిలోలు (20.4 పౌండ్లు) కాగా, రెండవ దాని బరువు 5.103 కిలోలు (11.25 పౌండ్లు) ఉన్నాయి. ముదురు వైలెట్, నీలం రంగులో ఉండే ఈ రత్నాలను అతను ప్రభుత్వానికి అమ్మాడు. దాదాపు 7.74 బిలియన్ టాంజానియన్ షిల్లింగ్స్‌కు ప్రభుత్వం ఆ రత్నాలకు అతని వద్ద నుంచి కొనుగోలు చేసింది. అంటే వీటి ధర భారతదేశ కరెన్సీలో రూ.25 కోట్లు అన్నమాట.

 

అతని అదృష్టానికి అందరూ మెచ్చుకున్నారు. తాజాగా ఆ దేశ గనుల మంత్రిత్వశాఖ శాశ్వత కార్యదర్శి సైమన్‌ మ్సంజిలా మాట్లాడుతూ.. ‘మిరేరానీలో మైనింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి రెండు అతిపెద్ద టాంజానిట్‌ రత్నాలను గుర్తించడం ఇదే మొదటిసారి. అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని తెలిపారు. టాంజానియా సెంట్రల్‌ బ్యాంక్‌ అతని దగ్గర నుంచి రత్నాలను కొనుగోలు చేసింది.ఇక తాను, తన కుటుంబం ఏ చీకూచింతా లేకుండా బతుకుతామని లైజర్ చెప్పాడు.  గత కొంత కాలంగా మైనింగ్‌ చేసేవారు తమ రత్నాలను, బంగారాన్ని ప్రభుత్వానికి విక్రయించడానికి టాంజానియా ప్రభుత్వం గత సంవత్సరం దేశవ్యాప్తంగా వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: