చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి పెద్దన్న అమెరికా సాయుధ బలగాలు ఇండియాకి అండగా ఉండటానికి రెడీ అయ్యాయి. చైనా ముప్పును ఎదుర్కోవడానికి భారత్ కి సహాయం చేయటానికి రెడీగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన ఓ కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. జర్మనీ నుండి తమ బలగాలను అమెరికా ఉపసంహరిస్తోంది. బలగాల తగ్గింపు ఎందుకు అన్న ప్రశ్నకు భారత్, దక్షిణాసియాకు చైనా ముప్పుగా పరిగణించడం మే కారణంగా తెలిపారు. చైనా చర్యలు చూస్తుంటే భారత్ ను బెదిరిస్తున్నట్లుగా ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి చెప్పుకొచ్చారు. అలాగే వియత్నం, ఇండోనేషియా, మలేషియా, ఫిలిపిన్స్ దేశాలకు డ్రాగన్ కంట్రీ తీరు ముప్పుగా పరిణమించినట్లు తెలిపారు.

 

దక్షిణ చైనా సముద్రంలో కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి అని అన్నారు. ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి అమెరికా బలగాలు ఇండియా కి అండగా, చైనా కి దీటుగా మోహరించ బోతున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. పరిస్థితికి అనుగుణంగా ఆర్మీని అన్ని వనరులను సిద్ధం చేసుకోవాలని… ప్రస్తుతం చైనా దూకుడు కి కళ్లెం వేయడానికి జర్మనీ నుండి ఇండియాకి అండగా ఆర్మీ బలగాలను పంపించనున్నట్లు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో తెలిపారు.

 

దీంతో పెద్దన్న చైనా ఇండియా సరిహద్దు వివాదంలో ఎంటర్ అవుతున్న తరుణంలో ఈ విషయం అంతర్జాతీయంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. మరోపక్క ఇటీవల చైనా ఇండియా సరిహద్దు వివాదంలో ఎవరిని జోక్యం చేసుకోకూడదని, ఎవరు కూడా మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదని రష్యా చెప్పుకొచ్చింది. ఇలాంటి సమయంలో అమెరికా ఈ విధంగా రియాక్ట్ అవ్వడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో అమెరికా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: