ఖజానా భర్తీపై జగన్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. షార్ట్ టర్మ్ ప్లాన్ లతో పాటు, లాంగ్ టర్మ్ ప్లాన్ లు కూడా సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను అవకాశాలను బేరీజు వేసుకుని పారిశ్రామిక సేవల రంగంలో వీలైన మేరా అభివృద్ధి సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగానే పన్ను ఎగవేత ఆర్థిక నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కరోనా సంక్షోభం నుండి ఆర్థికంగా గట్టెక్కించడానికి జగన్ సర్కార్ భారీగానే కసరత్తు స్టార్ట్ చేసింది. ఒక వైపు కరోనా వైరస్ అరికడుతూ మరోవైపు ఆర్థిక సంక్షోభం నుండి బయట పడటానికి గట్టి చర్యలు చేపడుతోంది.

 

దీంతో రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయం సమకూర్చాలి అనే విషయంపై ఆయా శాఖల కి చెందిన అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీర్ఘకాలిక ప్రణాళికతో పాటు స్వల్పకాలిక ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఏపీ ఖజానా నింపడం కోసం ఆర్థికశాఖ కసరత్తు స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగా ముందుగా పన్ను ఎగవేతదారుల పై డేగ కన్ను పెట్టింది జగన్ సర్కార్. వాణిజ్య మరియు ఇంకా కొన్ని వ్యాపార రంగాలపై గత ఏడాది పన్ను ఎగవేత విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో దాదాపు వెయ్యి కోట్లకు పైగా జిఎస్టి ఎగవేత వేయకుండా అడ్డుకున్నట్లు లెక్కల లో తేలింది.

 

అంతేకాకుండా రవాణా వాహనాల రాకపోకలపై సరికొత్తగా ఫోకస్ పెట్టబోతున్న ప్రభుత్వం ఆకస్మిక తనిఖీలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్ధిక రంగానికి లాభం చేకూరే అవకాశం ఉంది అని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మరింతగా పెంచుకోవడానికి జగన్ సర్కార్ ఈ ఏడాది నుండి సరికొత్త ఆలోచన కూడా చేయబోతున్నట్లు సమాచారం. కేంద్ర తరహాలో రాష్ట్రంలో కూడా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖకు అనుబంధంగా ఉండే విధంగా జగన్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే వృత్తి పరిధి పనుల్లోకి మరింత మార్పులు చేయడం వల్ల వచ్చే ఆదాయాన్ని మరింతగా పంచుకునే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: