విభజనతో నష్టపోయి అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి వైయస్ జగన్ సర్కార్ సరి కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణం ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్ర విభజన మరింత కుదేలు కావటంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీ గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించింది ప్రభుత్వం. దీనికితోడు విశాల సాగరతీరం అటవీ సంపద ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు టాక్ వస్తుంది. రాష్ట్రంలో టూరిజం బాగా అభివృద్ధి చేయటానికి స్కెచ్ లు రెడీ అవుతున్నయి.

 

ఆదాయం పెంచుకోవటానికి అన్నీ మార్గాలనూ ఉపయోగించుకోవడానికి జగన్ సర్కార్ రెడీ అయ్యింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల మందగించిన పారిశ్రామిక రంగాన్ని పునరుద్ధరిస్తూనే ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పై ప్రత్యేకమైన ఫోకస్ పెడుతోంది. రాష్ట్రాన్ని ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీ హబ్ గా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలను ఉపయోగించుకోవటానికి శ్రీకారం చుట్టింది రాష్ట్రప్రభుత్వం. అదేవిధంగా సేవల రంగం పై కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. విభజన తర్వాత సేవల రంగం వెనుకబడి పోవడంతో ఈ రంగం కి పెద్దపీట వేయటానికి జగన్ సర్కార్ రెడీ అయింది.

 

దీనిలో భాగంగానే టూరిజం పై ఫోకస్ పెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో 15 పర్యాటక ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్ లు రిసార్టులు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం విశాఖ ఉభయగోదావరి, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాలలో స్టార్ హోటళ్లు రిసార్టులు నిర్మాణానికి టూరిస్ట్ స్పాట్ లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా పర్యాటకులను ఆకర్షించాలని కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ప్రాంతాలకు అనుగుణంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జలక్రీడలు ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుని నిర్వహించాలని జగన్ సర్కార్ డిసైడ్ అయినట్లు టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: