కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడించేస్తుంది. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ మహమ్మారి కొన్ని లక్షలమంది ప్రాణాలను తీసుకుపోయింది. ఇంకా ఈ కరోనాను నియంత్రించేందుకు లాక్ డౌన్ లు అమలు చేసిన ఫలితం లేకుండా పోయింది. లాక్ డౌన్ తర్వాత కరోనా వైరస్ కేసులు దారుణంగా పెరిగిపోయాయి. 

 

ఇంకా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చూసి ప్రతి ఒక్కరు అలెర్ట్ అయిపోతున్నారు. రోగ నిరోధక శక్తి పెరుగుదల కోసం ఎన్నో చిట్కాలు పాటిస్తున్నారు. కొందరు ఉప్పు నీళ్లు పాటిస్తే.. మరొకొందరు ఆవనూనె నిమ్మకాయ నీళ్లు పాటిస్తున్నారు.. మరి కొందరు హెర్బల్ టీ ని ఫాలో అవుతున్నారు. ఇంకా మరికొందరు ఇంటి చిట్కాలు  ఫాలో అవుతున్నారు. 

 

IHG

 

ఇకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. గోరింటాకు పెట్టుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ గోరింటాకుతో ఇది ఒక్కటే కాదు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.. అవి ఏంటి అనేది ఇప్పుడు మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

గోరింటాకు ఒంట్లో వేడిని తగ్గిస్తుందట. ఇక రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ఎండాకాలం వచ్చింది అంటే చాలు అప్పట్లో మన పూర్వికులు గోరింటాకు పెట్టుకునే వారు. అందుకే సమయం ఉన్నప్పుడు.. ఇంటి ముందు జట్టు ఉన్నప్పుడు ఆకుని తీసుకొని రుబ్బుకొని పెట్టుకుంటే మంచిది అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ గోరింటాకు వల్ల కరోనాను చెక్ పెట్టలేకపోయినప్పటికీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది.             

మరింత సమాచారం తెలుసుకోండి: