ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాడి పరిశ్రమకు మహర్దశ రాబోతోందని అర్థమవుతోంది. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేలా రైతులకు అదనపు ఆదాయం సమకూరే విధంగా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. దీనికోసం ప్రతిష్టాత్మక సహకార కంపెనీ అమూల్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఊహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోబోతుంది. దీని ద్వారా ఆ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతమైన మార్కెటింగ్ ని వినియోగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు అలాగే రైతులకు మంచి ధర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

 


అయితే ఈ విషయంపై జూలై 15 వ తేదీ లోగా అమూల్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి పాడి రైతుల సమస్యలను తీర్చే దిశగా కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సహా మరికొందరు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 


ఈ సమావేశంలో పాల ఉత్పత్తిదారుల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగు పరచుకోవడం అలాగే రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందే దిశగా ఎలా అడుగులు వేయాలన్న విషయాలపై మాటామంతి జరిగింది. రైతులకు కష్టానికి తగ్గ ప్రతిఫలం పాల ఉత్పత్తిదారులకు లభించేలా నాణ్యమైన పాల ఉత్పత్తులు జరిగేలా వారికి కావాల్సిన చర్యలపై ఇదివరకే సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు తయారు చేసిన ప్రతిపాదనలను వాటిపై తీసుకోవాల్సిన చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇకపోతే అమూల్ కంపెనీ తో జరిపిన చర్చలు రాష్ట్రంలో పాడి పరిశ్రమ లపై ఆ కంపెనీ వెల్లడించిన విషయాలను అధికారులు సీఎం కి తెలియజేశారు.

 

 

ఇక ఈ సమావేశంలో అమూల్ కంపెనీ కి సంబంధించిన వ్యాపార లావాదేవీల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై జూలై 15 లోగా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు విధివిధానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాతే ఒప్పంద పత్రాలపై సంతకం చేయమని చెప్పారు. ఇందుకు గాను అధికారులు జూలై 15వ తారీఖు లోపల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొంటామని ముఖ్యమంత్రికి తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: