నష్టాలకు స్వస్తి చెబుతూ నేడు దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. బెంచ్ మార్క్ సూచీలు లాభాల బాట పడ్డాయి. మార్కెట్ చివరి గంటలో బాగా పుంజుకొని వారాంతంలో మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 329 పాయింట్లు లాభపడి 35171 వద్ద ముగియగా, నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 10383 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు మార్కెట్లో దాదాపు అన్ని రంగాలలో లాభాల బాట పట్టాయి.

 

IHG

 

ముఖ్యంగా psu బ్యాంక్, మెటల్ ఇండెక్స్ లాభపడ్డాయి. అన్నిటికన్నా ఐటీ షేర్లు లాభాలతో దారి చూపాయి. ఊహించిన దానికంటే అసెన్సర్ కంపెనీ ప్రకటించిన త్రైమాసిక ఫలితాలతో ఐటీ కంపెనీల షేర్లు లాభాల బాట పట్టాయి.

 

IHG

 

ఇక నేటి ఇంట్రాడేలో నిఫ్టీ 50 లోఇన్ఫోసిస్, డిపిసిఎల్, ఐఓసి, పిసిఎస్, ఇందుస్ ల్యాండ్ బ్యాంక్ లాభాల బాట పట్టగా అందులో ఇన్ఫోసిస్ ఏకంగా ఏడు శాతం లాభపడింది. ఇక మరోవైపు భారతీ ఇంఫ్రాటెల్, ఐటిసి, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, mahindra BANK' target='_blank' title='కొటక్ మహీంద్రా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కొటక్ మహీంద్రా షేర్లు నష్టాల బాట నడిచాయి. ఇక భారతీ ఇంఫ్రాటెల్ అత్యధికంగా 3 శాతం పైగా నష్టపోయింది.

 

IHG

 

ఇక అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ రూపాయి మారకపు విలువ 15 పైసలు నష్టపోయి 75.47 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది.అలాగే నేటి భారతీయ మార్కెట్లో బంగారం విషయానికి వస్తే 231 రూపాయలు నష్టపోయి రూ.47710 వద్ద ముగిసింది. ఇక అలాగే వెండి కూడా 584 రూపాయలు నష్టపోయి రూ. 47532 వద్ద ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: