కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు నానాటికి పెరుగుతున్నాయి.  నేను ఒక్క రోజే నమోదైన కరోనా కేసు వివరాలను కర్ణాటక ఆరోగ్య శాఖ బులిటెన్ ద్వారా మీడియాకు తెలియజేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 445 కేంద్రాల్లో కొత్తగా నమోదవగా నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11005 కేసులు నమోదయ్యాయి. ఇక మరోవైపు 246 మందికరోనా మహమ్మారి నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో నేటి వరకు రాష్ట్రంలో 6916 కేసులు డిశ్చార్జ్ చేయడం జరిగింది.

 

 


నేను ఒక్క రోజే కర్ణాటక రాష్ట్రంలో పది మంది మరణించారు. దింతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 180 కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3905 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులలో 178 మంది కి సీరియస్ గా ఉండడంతో ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు.

 

IHG

 

ఇక నేడు ఒక్క రోజే 21 మంది విదేశాల నుంచి వచ్చే వారికి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 65 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. రాష్ట్రంలో ఎక్కువ కేసులు బెంగళూరు మహానగరంలో నే నమోదు అవుతుండడంతో నగర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: