ఆంధ్ర‌ప్ర‌దేవ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం భారతీయ జనతా పార్టీ వలనే సాధ్యమవుతుందని  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  అన్నారు. ఎన్డీయే - 2 పాలన ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మూడో “జన-సంవేద్ వర్చువల్ ర్యాలీని ” శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన ర్యాలీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా  సీతారామన్ పాల్గొని మోదీ. 2.0 ప్రభుత్వ విజయాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంక్షిస్తూ భాజపా లక్షల కోట్ల నిధులిచ్చిందని, పలు ప్రాజెక్టులు అమలుచేస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 


ప్రధాని మోదీ 5 ఏళ్ల పాటు నిర్వహించిన సమర్థవంతమైన, అవినీతి రహిత పాలన, దేశాభివృద్ధి చూసిన ప్రజలు మరల 2019లో అత్యధిక సీట్లు ఇచ్చి అధికారం కట్టబెట్టారు. ప్రమాణస్వీకారానికి ముందు మే 30న నరేంద్రమోదీ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ ఒక లేఖ రాసారు. అయిదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, భాజపా అంత్యోదయ నినాదానికి అనుగుణంగా అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ వివరించారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూడా మోదీ అనేక నిధులు మంజూరు చేశారని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక సేవా రంగాలు మూడు మంచి స్థానంలో ఉండటంతో స్థూల దేశీయ ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ 9వ ర్యాంకులో ఉందని పేర్కొన్నారు. 


ఏడాది కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే సంకల్పంతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా పనిచేస్తున్నారని, జూన్ 22 వ తేదీ నాటికి రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో 936.16కోట్లు వేశారని, ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశం మొత్తంగా రైతులకు 30వేల కోట్లు రూరల్ ఆపరేటివ్ బ్యాంకు ద్వారా చిన్నమొత్తంలో రుణాలను అందించారని తెలియజేశారు. ఇప్పటికే బడ్జెట్లో కేటాయించిన రూ. 90 వేల కోట్లు కలిపి మొత్తం రూ. 1.20 లక్షల కోట్లు రైతులకు కేటాయించినట్లైందని, ఇవికాక పిఎం కిసాన్ సంపత్ యో ద్వారా నమోదైన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు లేకున్నా వారికి ఈ రుణాలు లభించేలా ఉత్తర్వులు ఇచ్చామన్నారు. వ్యవసాయ, మౌలిక సదుపాయాలకోసం కోల్డ్ స్టోరేజీలు, విద్యుత్ సరఫరా వంటి వాటిలో ప్రైవేటు పెట్టుబడులు పెట్టేవారికి ఆత్మనిర్బర్ భారత్ యోజన ద్వారా వయబులిటీ గ్యాప్ ఫండింగ్ సదుపాయం కల్పించేలా రూ. 8 వేల కోట్లు కేటాయించామన్నారు. 


ఎపీలోని తొమ్మిది జిల్లాలు సముద్రతీర ప్రాంతంలో మత్స్యకారులు ఉన్నారు. 546 మత్స్యకారులు నివసించే గ్రామాలు ఉంటే.. 349 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఉన్నాయి. 2010 గణాంకాల ప్రకారం ఆరు లక్షల మందికి పైగా మత్సత్యకారులు ఉండగా, నేడు ఎనిమిది లక్షల మంది ఉన్నారు. ఎపీలో 1.63 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇరవై వేల కోట్లు మత్స్య సంపద యోజన కింద మత్స్యకారుల ప్రయోజనం కోసం కేంద్రం ఇచ్చిందన్నారు. ఇందులో పదకొండు వేలకోట్ల రూపాయలు ఇన్లాండ్ ఫిషింగ్ మెరైన్ ఫిషింగ్, ఆక్వా కల్చర్‌కు కేటాయించామని. రాష్ట్రంలోని మత్స్యకారులు ఈ ఆక్వా, మెరైన్ ఫిషింగ్ లను బాగా వినియోగించుకోవాలన్నారు.  శ్రీకాకుళం నుంచి గుజరాత్ లో చిక్కుకున్న మత్స్యకారులను బస్సుల్లో క్షేమంగా వారి ఇళ్లకు చేర్చామని, ఏపీ ప్రజలకు అన్ని విధాలా మోదీ చేయూతను అందించడమే కాకుండా ఏపీ ప్రభుత్వానికి, కోవిడ్ పై పోరాటానికి రూ.8025 కోట్లను ఏప్రిల్ నెల నుంచి ప్రధాని ఇచ్చారని పేర్కొన్నారు. 

ప్రధాని కూడా  ఎప్పటికప్పుడు నిధులను మంజూరు చేయాలని త‌న‌ను ఆదేశించారని నిర్మ‌లా సీతారామ‌న్‌ అన్నారు. ఏ రాష్ట్రానికీ నిధుల కొరత లేకుండా ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి వారి అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకుంటున్నామని, రాజకీయ పార్టీలు కూడా కరోనా సేవలు అందించడంలో ముందున్నాయని ముఖ్యంగా బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో విధాలుగా ప్రజలకు సేవలు అందించారని అభినందనలు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: