కరోనా దేశం అతలాకుతలం చేస్తోంది. కేసుల సంఖ్య ఇప్పటికీ తగ్గకపోగా, రోజురోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పట్టణాలకే పరిమితం అయింది అనుకున్నా, మారుమూల పల్లెటూర్లకు ఇది తాకింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా భయం వెంటాడుతోంది. ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారు. ఎవరికి వారు సొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నా, కొంతమంది  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి కారణాలతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిన్నట్లుగా కనిపిస్తోంది.

 


 నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్రం కూడా ఆలోచనలో పడినట్లు సమాచారం. ఈ మేరకు మరోసారి దేశవ్యాప్తంగా అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు కొన్ని కొన్ని సంకేతాలను కూడా కేంద్రం ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నెలాఖరు వరకు మాత్రమే రైళ్లు తిరుగుతాయని, ఆ తరువాత జూలై 1 నుంచి 12 వరకు సాధారణ రైళ్లు మాత్రమే తిప్పుతామని  రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకున్నవారికి టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామంటూ ప్రకటించడంతో ఈ అనుమానాలు మొదలయ్యాయి.


 ఈ నెలాఖరు లోపు అందరూ తిరిగి తమ ప్రాంతాలకు చేరుకోవాలని, పరోక్షంగా కేంద్రం హెచ్చరించినట్లుగా కనిపిస్తోంది. నిపుణులు కూడా కేంద్రం మరోసారి విచారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అంటే జూలై 1 నుంచి ఆగస్టు వరకు లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.అప్పటికి కరోనా వాక్సిన్ కూడా  అందుబాటులోకి వస్తుందని, అప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందనే అభిప్రాయంతో కేంద్రం ఉండడంతో, ఏ క్షణమైనా లాక్ డౌన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ముందస్తుగా సమాచారం ఇస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: