కోవిడ్ 19 చైనా నుండి ఇతర దేశాలలో ప్రవేశిస్తున్న నాటినుండి ప్రపంచ దేశాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ జాగ్రత్తలు చెప్పింది WHO. కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం దేశ పరిస్థితులకు అనుగుణంగా దేశ నాయకులకు సూచనలు సలహాలు ఇస్తూ దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఏమిరా ఉంది అన్న విషయంలో ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తోంది. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం ఏకతాటిపైకి తీసుకువచ్చి చాలావరకు వైరస్ వ్యాప్తి తగ్గించేందుకు అనేక ఆ దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలపడం జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం WHO ఈ వైరస్ గురించి వెన్నులో వణుకు పుట్టించే వార్త ఒకటి చెప్పుకొచ్చింది.

 

దీనిలో భాగంగా డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ప్రజెంట్ ఈ వైరస్ బారిన పడిన దేశాలు లాక్డౌన్ నుండి మెల్లమెల్లగా బయట పడుతున్న సమయంలో….సామాన్య జనులు యధావిధిగా తమ పనులు ఎటువంటి భయం లేకుండా కొంతమేర మళ్లీ అలవాటుపడుతున్న తరుణం లో ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని చెప్పుకొచ్చారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం మాస్కు ధరించాలి ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని తెలిపారు. ఇదే సమయంలో డబ్ల్యూహెచ్ సభ్యుడు డాక్టర్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ ” ప్రస్తుతానికి పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు.

 

రాబోయే రోజుల్లో వైరస్ సోకిన బాధితులు ఎక్కువ మంది మరణించే అవకాశం వుంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం ” అంటూ వెన్నులో వణుకు పుట్టించే వార్త చెప్పుకొచ్చారు. ముఖ్యంగా దక్షిణాది ఆసియాలో ఈ వైరస్ వల్ల లక్షలాది మంది పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు. ఇటీవల జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: