కరోనా వచ్చింది.. మంచికో చెడుకో తెలియదు గానీ, ఎన్నో మార్పులు జనాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆఫీసులకు వెళ్లేవారు సంఖ్య తగ్గిపోయింది. ప్రతి ఒక్కరూ ఇళ్ల వద్ద నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా ఈ ట్రెండ్ కు ఇప్పుడిప్పుడే బాగా అలవాటు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఈ తరహా రాజకీయాలకు నాంది పలికింది. ఆ పార్టీ ప్రతి యేటా ఘనంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని జూమ్ యాప్ ద్వారా నిర్వహించి సరికొత్త రికార్డును సృష్టించింది. తెలుగుదేశం పార్టీ జూమ్ మహానాడు సక్సెస్ కావడంతో మిగతా రాజకీయ పార్టీల దృష్టి వాటిపై పడింది. ఇప్పటికీ లాక్ డౌన్ నిబంధనలు అమలు అవుతుండడంతో, ఈ సమయంలో  పార్టీ కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ కార్యక్రమాల కానీ, భారీగా నిర్వహించేందుకు అవకాశం లేకపోవడంతో, ఇప్పుడు ఆన్లైన్ వేదికగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

 

IHG


కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తూ, వారి ఇబ్బందులను, సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ కూడా ఈ తరహా విధానానికి బాగా అలవాటుపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందించే విధంగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సైతం ఆన్లైన్ ద్వారా పూర్తయ్యేలా , ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే దేశంలోని టెలిమెడిసిన్ వినియోగంపై వైసీపీ ప్రభుత్వం ప్రయోగం చేపట్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇక్కడితో ఈ వ్యవహారం ఆగిపోలేదు. తెలంగాణలోనూ ఇదే తరహాలో ఆన్లైన్ ద్వారానే అన్ని కార్యక్రమాలను అక్కడి ప్రభుత్వం నడిపిస్తోంది.

 

 వ్యయ ప్రయాసలు కోర్చి ప్రజల్లో తిరగాల్సిన అవసరం లేకుండా సురక్షితంగా కార్యాలయాల నుంచి పర్చువల్  సభలు నిర్వహిస్తోంది. ఇటీవల బీజేపీ కూడా ర్యాలీలు సభలు నిర్వహించింది. ఇక లాక్ నిబంధనలు చాలా కాలమే అమలయ్యేలా కనిపిస్తోంది. పూర్తిగా ఎత్తి వేసినా అప్పటి రాజకీయ పార్టీలు ఆన్లైన్   వేదికగానే సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. భారీ ఎత్తున జన సమీకరణ చేయడం వంటివి ముందు ముందు ఇబ్బంది అయ్యే అవకాశం కనిపిస్తోందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నే ముఖ్యమైన మీటింగ్ పర్చువల్ పద్ధతిలో కార్యకర్తలతో నేరుగా మాట్లాడే విధంగా ప్రస్తుతం రాజకీయ పార్టీలు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ మేరకు కార్యకర్తలకు వీటి వినియోగంపై అవగాహన కల్పిస్తూ, రాజకీయ పార్టీలు సరికొత్త రీతిలో ముందుకు వెళుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లోనూ రాజకీయం అంతా ఆన్లైన్ రాజకీయంగానే ఉండేలా కనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే రాజకీయ పార్టీ లు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: