కవ్వించడం జాణతనం, ముగ్గులోకి దించడం నెరజాణతనం, మరి డైరెక్ట్ గా మగాడిలా వచ్చే దమ్మూ ధైర్యం లేని వాళ్ళు చేసే పనులివి. చైనా తీరు కూడా అలాగే ఉంది. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తోంది. చర్చలు, శాంతి అంటూ వంకాయి కబుర్లు చెబుతూ దొంగ దెబ్బలు తీస్తోంది. ఇంతకీ ఈ డ్రాగన్ కి కావాల్సింది ఏంటి.

 

అంటే పోయిన ప్రతిష్టను తెచ్చుకోవడం, చైనా వైరస్ అంటూ పిలుస్తున్న వారికి తన సత్తాను చాటడం. అంటే ఏకంగా అమెరికాకే కన్ను కొడుతోంది అన్నమాట. తన సైనిక పాటవంతో అగ్ర రాజ్యాన్ని హడలెత్తించాలని చైనా చేస్తున్న దుర్మార్గపు ఎత్తులకు రిహాల్సల్స్ గా భారత్ తో ఫైట్  మారాలిట.

 

భారత్ ని దెబ్బెస్తూ తన సైనిక ప్రతిభను తన బలాన్ని చూపెడుతూ చైనా రెచ్చిపోతూంటే అమెరికా సహా ప్రపంచ అగ్ర రాజ్యాలు వణికిపోవాలన్నమాట. ఈ చైనాతోనా మేము పెట్టుకుంటామన్నది మా వల్ల కాదు బాబోయ్ అని లగెత్తాలన్న మాట.

 

ఈ జిత్తులమారి ఎత్తులలో మరో కోణం కూడా ఉంది. ఆసియాలో తానే అతి పెద్ద అగ్ర రాజ్యమని నిరూపించుకోవడం, అమెరికా దోస్తీ చేస్తున్న భారత్ తన ముందు ఏమీ కాదని చెప్పడం, ఇది చైనా మనసులోని మాట. దీని మన భారతీయ కమ్యూనిస్టులు బాగానే అర్ధం చేసుకున్నారు. అందుకే వారు మోడీ పెట్టిన అఖిల పక్ష భేటీలో అమెరికాతో రాసుకుపూసుకు తిరగవద్దు అంటూ సూచనలు  చేశారు.

 

అంటే అతి పెద్ద దేశంగా మారుదామని, అగ్ర రాజ్యం అవతారం ఎత్తుదామని ఎత్తులు వేస్తున్న చైనా అడుగులకు భారత్ మడుగులు ఒత్తుతూ అక్కడే ఉండాలన్నమాట. దక్షిణాసియాలో మరో దేశం అభివ్రుద్ధి చెందిన దేశంగా ఉండరాదు అన్న మాట. నిజానికి చైనాకు భారత్ ఎదుగుదల కన్ను కొడుతోంది. అమెరికా సహకారం మంట పుట్టిస్తోంది. దానికంటే ఎక్కువగా చైనా వైరస్ అంటూ చేస్తున్న అవమానాలు రగిలిస్తున్నాయి.

 

అన్నిటికీ ఒకే మందు అన్నట్లుగా ఇపుడు భారత్ మీద చైనా పడింది. ఈ దెబ్బకు అమెరికా సహా ఇతర దేశాలు నోళ్ళు మూసుకోవాలని, లేకపోతే మూడవ ప్రపంచ యుధ్ధమేని చెప్పాలనుకుంటోంది ఈ బెదిరింపుల చైనా. మరి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైనట్లేనా.

మరింత సమాచారం తెలుసుకోండి: