తెలంగాణలో కరోనా విధ్వంసం కొనసాగుతుంది. ఈఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 985 పాజిటివ్ కేసులు వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది అందులో అత్యధికంగా జిహెచ్ఎంసి లో 774,రంగారెడ్డి లో 86,మేడ్చల్ లో 53కేసులు బయటపడ్డాయి. వీటి తరువాత వరంగల్ అర్బన్ లో అత్యధికంగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
 
జిల్లా వ్యాప్తంగా 20కేసులు నమోదుకాగా వరంగల్ రూరల్ లో మాత్రం ఈరోజు కేసులు ఏమి రాలేదు అటు జయశంకర్ భూపాలపల్లి లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈరోజు మొత్తం 4374శాంపిల్ టెస్టులు చేశారు. కాగా ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 12349కరోనా కేసులు నమోదవ్వగా అందులో 4766మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 7436కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఈరోజు కరోనాతో 7గురు మరణించడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 237కి చేరింది. 
ఇక దేశ వ్యాప్తంగా ఈఒక్క రోజే 18000కు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క మహారాష్ట్రలోనే 5024 కేసులు నమోదు కాగా ఢిల్లీలో 3460, తమిళనాడులో 3645 కేసులు బయటపడ్డాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు ఇండియాలో 509000కరోనా కేసులు నమోదు కాగా   15500కు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన  దేశాల జాబితాలో ప్రస్తుతం భారత్ 4వ స్థానంలో కొనసాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: