ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయ పార్టీలతో సానిహిత్యం ఏమిటో అన్న ప్రశ్న తాజాగా పార్క్ హయత్ హోటల్ లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసులు తో భేటీ అయిన వీడియో బయట పడిన తర్వాత ఏ పీ వాసుల్లో నెలకొంది. ముందు నుండి నిమ్మగడ్డ రమేష్ తెలుగుదేశం పార్టీ కి మరియు ఒక సామాజిక వర్గానికి మేలు చేసే విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేయాలని చూస్తున్నట్లు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో రాజకీయంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఈ విధంగా వైసీపీ పార్టీ నాయకులు కావాలని  విమర్శలు చేస్తున్నారని మీడియా మరియు ఏపీ జనాలు అనుకోవటం జరిగింది.

 

కానీ తాజాగా పార్క్ హయత్ హోటల్లో ఏకంగా రాజకీయ నాయకులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి సమావేశం అవటంతో ఏపీ వాసులలో నిమ్మగడ్డ వ్యవహారంపై అనుమానం స్టార్ట్ అయింది. మేము ఎన్నుకున్న ప్రభుత్వాలను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా రాజకీయాలు చేసి కుట్రలు పన్నడం మేము ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగానే వ్యవహరించడంతో సమానమని ఏపీ వాసులు ఆగ్రహం చెందుతున్నారు.

 

పైగా ఇలాంటి సమావేశాలు పెట్టి హైకోర్టులో ప్రభుత్వం నన్ను అనుమతించటం లేదు,  అదేవిధంగా గవర్నర్ కి ఫిర్యాదు చేయడం పట్ల నిమ్మగడ్డ చాలా బాగా యాక్ట్ చేస్తున్నారని ఏపీ వాసులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వాసులకు నిమ్మగడ్డ పార్క్ హయత్ హోటల్ వీడియో విషయంలో ఒక లెటర్ రాసి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని తాజా పరిణామాలపై పరిశీలకులు సూచనలు ఇస్తున్నారు. మరోపక్క అధికార పార్టీ వైసిపి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పార్క్ హయత్ హోటల్ లో సదరు పొలిటికల్ నేతలతో భేటీ అవ్వడం వెనకాల ప్రభుత్వంపై కుట్ర చేసే అవకాశం ఉందని ఈ ముగ్గురి బేటి వెనకాల చంద్రబాబు హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: