తొలుత చైనాలో మొదలైన కరోనా వైరస్ విధ్వంసం ఇప్పుడల్లా తగ్గేలా అయితే లేదు. అయితే ప్రపంచ దేశాలన్నింటికీ గతి పట్టడానికి  పరోక్షంగా డబ్ల్యూహెచ్వో నిర్లక్ష్యం మరియు ప్రపంచదేశాలను అప్రమత్తం చేయలేని వారి ఉదాసీనతే కారణం అన్న ఎన్నో విమర్శలను ఆరోగ్య సంస్థ ఎదుర్కొంది.

 

అంతే కాకుండా కొన్ని దేశాల్లో అయితే చైనా తో చేతులు కలిపి వారు చాలా పక్షపాతం గా వ్యవహరించారని ఆరోపణలు కూడా చేశారు. వీటన్నింటి మధ్య సగటు మనిషి కోరుకునేది ఏమిటంటే రోగం నుండి తమకు విరుగుడు ఎప్పుడో చెప్పమని. కనీసం దాని గురించిన సమాచారం ఇచ్చినా చాలని ఇన్నాళ్ళు డబ్ల్యు.హెచ్. ను మొత్తుకున్నారు.

 

ఇక చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి ట్రెడోస్ కరోనా వ్యాక్సిన్ తయారీకి కనీసం ఒక సంవత్సరం అయినా పడుతుందని చెప్పేశాడు. యూరోపియన్ పార్లమెంట్ ఆరోగ్య కమిటీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన డబ్ల్యు.హెచ్. చీఫ్ ట్రేడోస్ వ్యాక్సిన్ త్వరగా వస్తే అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

అయితే కరోనా ను నయం చేసే లేదా సోకకుండా చేసే వ్యాక్సిన్ కచ్చితంగా ఇప్పట్లో వస్తుందని చెప్పడం కష్టం అని.... శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే వంద మందికి పైగా తమ సంస్థకు వ్యాక్సిన్ తయారీకి సంబంధించి నివేదికలు పంపారు అనిఅందులో ఒకటి అభివృద్ధి దశలో ఉందని ఆయన అన్నారు.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే తమ దగ్గర ఉన్న నివేదికలను పరిశీలించిన మీదట దాదాపు ఒక సంవత్సరం రోజులలో వ్యాక్సిన్ మార్కెట్లోకి విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే పరిస్థితిని వేగవంతం చేసి అంతకన్నా తక్కువ సమయంలోనే దానిని తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని కూడా చెప్పారు. ఇక మరో ఏడాది అంటే లోపల స్కూళ్ళు, థియేటర్లు, రైలు, విమాన మార్గాలు అన్నీ దాదాపు బంద్ అయిపోయినట్లేనా?

మరింత సమాచారం తెలుసుకోండి: