ఒకప్పుడు సమాజంలో కలిసి ఉండకపోతే తిట్టేవారు.. కానీ ఇప్పుడు అందరు కలిసి ఒకే చోట ఉంటే భయపెడుతున్నారు, భయపడుతున్నారు.. దీనికంతటికి కారణం కరోనా అనే రాక్షసి.. ఎవరికి ఎవరిని కాకుండా చేస్తుంది.. కనీసం పక్షులకు, జంతువులకు ఉన్న స్వేచ్చ కూడా ఇప్పుడు మనుషులకు లేదు.. ఒక కాకి చచ్చిపోతే వందల కాకులూ కావ్ కావ్ అంటూ గోల చేస్తాయి.. కానీ నేటి పరిస్దితుల్లో సాటి మనిషి మరణిస్తే కన్నవారు, కట్టుకున్న వారు, బందువులు అంటూ ఒక్కరు కూడా రావడం లేదు.. అనాధ శవాల్లా మారుతున్నారు మరణించిన వారు.. అందుకు కొన్ని సంఘటనలు ఉదాహరణగా చెప్ప వచ్చూ..

 

 

అదేమంటే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఉదయపురం సమీపాన శుక్రవారం ఉదయం 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో మరణించాడు. కాగా ఈ ప్రాంతం కంటైన్‌మెంట్‌ జోన్‌ కావడంతో అంత్యక్రియలకు ముందు మృతదేహం నుంచి శాంపిల్స్‌ సేకరించి, అప్పటికప్పుడు ‘వీఎల్‌ఎం’ కిట్‌ల ద్వారా కరోనా పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, కాలనీ వాసులంతా మృతదేహాన్ని వదిలి భయంతో పరుగులు పెట్టారు. దీంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు వేయించి మృతదేహాన్ని మున్సిపాలిటీ జేసీబీతో శ్మశానానికి తరలించారు.

 

 

ఇలాంటిదే మరో ఘటన.. తార్నాక ప్రాంతంలో నివసించే లక్ష్మి (58) భర్త కరోనాతో చనిపోయాడని తెలవగానే బంధువులంతా ఇంటికి దూరమయ్యారు. సిటీలో ఉండే కన్న కూతురు కూడా తల్లిని పరామర్శించేందుకు రాలేదు. తనకు చిన్న పిల్లలున్నారని రాలేనని తెగేసి చెప్పింది. దీంతో ఒకవైపు భర్తను కోల్పోయి, మరోవైపు కన్న కూతురు పలకరించక, బంధువుల ఊరడింపుకూ నోచుకోలేక తన ఇంట్లోనే ఒంటరిగా కుమిలి పోతున్నది.. ఇలా ఒక తల్లిని తన కొడుకులు ఇంటికి రానివ్వలేదు.. తన తండ్రి చనిపోతే అమెరికాలో ఉండే కొడుకు.. కనీసం తండ్రి చివరి ఫొటోలు పంపమన్నా బంధువులు సాయం చేయలేదు. దాంతో డాక్టర్లే ఫొటోలు తీసి ఆయనకు వాట్సప్‌ చేశారు. శవాన్ని జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఖననం చేశారు.

 

 

చూశారా ఇలాంటి వ్యధలు ఎన్నో ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నాయి.. ఒక్కటా రెండా అని చెప్పడానికి కూడా లేదు.. గుండె గుండెకో బాధ.. అడుగు అడుగుకో వ్యథ.. కరోనా తెచ్చిన కష్టమిది.. నాటి సామాజిక దూరాన్ని గుర్తు చేస్తోంది. ముందు ఫిజికల్ గా.. తర్వాత మానసికంగా దూరం చేస్తోంది. మనుషులనే కాదు.. మనసులనూ చంపుతోంది. మానవత్వానికి సమాధి కడుతోంది. ఎవరికి ఎవరు కాకుండా రాక్షసంగా ప్రవర్తిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: