చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచం మొత్తం చుట్టేసింది. అమెరికా లో అయితే దారుణంగా మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది.  వాస్తవానికి మొన్నటి వరకు ఇక్కడ కేసులు తగ్గు ముఖం పట్టినా.. మళ్లీ పెరిగిపోతున్నాయి.  ఆ తర్వాత  బ్రెజిల్, రష్యా ఆ తర్వాత నాలుగో స్థానం మన భారత్.  గత రెండు నెలల క్రితం లాక్ డౌన్ చేయడంతో ఎవరూ బయటకు రాకపోవడంతో కేసులు నామ మాత్రంగా పెరిగినా..  ఈ మద్య లాక్ డౌన్ సడలించడంతో కేసులు తారా స్థాయికి చేరుతున్నాయి.  ప్రపంచంలోని ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 94 లక్షల కేసులు నమోదు కాగా.. 50.65 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.

 

మరోవైపు అత్యధిక రికవరీ రేటుతో ప్రపంచ దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలుస్తోంది. కరోనా రోగుల రికవరీ రేటు 54 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా సోకినవారు పెద్దగా భయపడాల్సిన పని లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే 56.70శాతం రికవరీ రేటుతో భారత్‌ అత్యంత సురక్షితమైన స్థానంలో ఉందని స్పష్టంచేసింది. ప్రపంచవ్యాప్తంగా రికవరీ రేటుతో పోల్చి చూస్తే భారత్ మెరుగైన స్థానంలో ఉందని చెప్పారు. అత్యధిక రికవరీ రేటుతో ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానంలో భారత్ నిలిచిందని తెలిపింది.  ఇప్పటివరకు భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,90,401కి చేరుకోగా, ఇప్పటివరకు నమోదైన మృతుల సంఖ్య 15,301కి చేరుకుంది.  

 

భారత్‌లో  పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగున్నర లక్షలు దాటినప్పటికీ.. వాటిలో సీరియస్‌ కేసులు కేవలం తొమ్మిది వేలు మాత్రమే ఉన్నాయి. దేశంలో మహారాష్ట్ర,రాజస్థాన్, తమిళనాడులో కేసుల తీవ్రంగా నమోదు అయ్యాయి.. కాకపోతే  భారత్‌లో రాజస్తాన్‌ 78శాతం రికవరీ రేటుతో మొదటి స్థానంలో ఉంది. భారత దేశంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే ఆహారపు అలవాట్లు ఉండటం ఓ మంచి పరిణాం అని వారు అంటున్నారు. భారత్‌లో  పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగున్నర లక్షలు దాటినప్పటికీ.. వాటిలో సీరియస్‌ కేసులు కేవలం తొమ్మిది వేలు మాత్రమే ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: