పార్టీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్న నరసాపురం ఎంపీ రఘురామ కష్ణంరాజు మరింతగా ఇప్పుడు పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, మీడియాలో అనేక సంచలన విషయాలు బయట పెడుతూ హడావుడి చేస్తున్నారు. నిన్ననే ఢిల్లీకి వెళ్లి వైసీపీ తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసు చెల్లుతుందా లేదా అనే క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్ రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ సందర్భంగా అసలు వైసిపి నిబంధనల మేరకు ఏర్పాటు అయిందా లేదా ? ఇలా అనేక సందేహాలు ఎన్నికల కమిషన్ దగ్గర తీర్చుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాస్త ఆందోళన కలిగించాయి. ఆయనను పార్టీ నుంచి మాత్రమే కాకుండా, ఆయన ఎంపీ పదవి రద్దు చేయిస్తాం అంటూ పరోక్షంగా హెచ్చరికలు ఇస్తోంది. 

IHG


ఈ మేరకు గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న శరద్ యాదవ్ పై  అనర్హత వేటు వేసిన అమాశాన్ని వైసిపి మీడియాలో హైలెట్ చేస్తూ.. రాజుగారికి త్వరలోనే పదవి ఊడుతుంది అనే సంకేతాలు ఇస్తోంది. దీనికి కౌంటర్ గా అన్నట్టుగా త్వరలోనే వైసీపీ ని రద్దు చేయించబోతున్నట్లు ఆయన పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ అనుకూల మీడియా కు పదేపదే ఇంటర్వ్యూ లు ఇస్తూ ఈ సంకేతాలను పంపిస్తున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబంధనల మేరకు ఏర్పాటు అవ్వలేదని, ఎన్నికల సంఘం పెట్టిన నియమాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదని, ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.


 ఇక అక్కడితో ఆగకుండా, మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండి వైసీపీ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దగ్గర తేల్చుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. రఘురామకృష్ణంరాజు వ్యవహారం అంత తేలిగ్గా చూడకూడదు అని, ఆయన వెనకాల ఖచ్చితంగా బిజెపి ఉండే ఉంటుందని, అందుకే ఆయన  ఈ స్థాయిలో ఇంతగా హడావుడి చేస్తున్నారని వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అలాగే రఘురామకృష్ణంరాజు పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: