హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ముగ్గురు రహస్యంగా భేటీ అయిన వ్యవహారానికి  సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటికి రావడం పెద్ద కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పుడు ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. సుజనా చౌదరి బిజెపిలో చేరినా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు అనుకూలంగా పని చేస్తున్నారని, అసలు అంత రహస్యంగా వారు కలవాల్సిన అవసరం ఏంటని ? అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొంటున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను చంద్రబాబు సన్నిహితులు ఎందుకు కలవాల్సి వచ్చింది ? ఇలా ఎన్నో అంశాలపై వైసిపి నాయకులు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు.

 

IHG


ఈ వ్యవహారం ఇలా ఉండగానే, మరో సంచలన విషయం బయటకు వచ్చింది. సుజనాచౌదరి తో పాటు అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భేటీ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వైసీపీలో ఈ వ్యవహారం పెద్ద రాద్దాంతమే జరుగుతోందట. సుజనా చౌదరి తో భేటీ అయ్యారనే వాదనకు బలం చేకూర్చుతూ సీసీ పూటేజీ లో కనిపించిన కొంతమందిని వైసీపీ రాజకీయ సలహాదారులు ఇద్దరు పిలిచి క్లారిటీ అడిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సుజనా చౌదరి కార్యాలయంపై వైసిపి నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం.


 రెండు వారాలకు సంబంధించిన సీసీ టీవీ పుటేజ్ ఆధారాలను కూడా వైసిపి సేకరించగా అందులో విస్తుపోయే నిజాలు బయట పడ్డాయట.  వైసిపి కి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు సుజనా చౌదరి ని కలిసి అనేక విషయాలపై మంతనాలు చేసినట్లు వైసిపి ఆధారాలు సేకరించి పెట్టుకుంది. కాగా ఈ విషయం బయటకు పొక్కడంతో, బిజెపి కూడా అప్రమత్తమైంది. దీనిపై ఇప్పటికే సుజనాచౌదరి ఆగ్రహంగా ఉన్నారట. తమ కార్యాలయం పై నిఘా పెట్టిన వ్యవహారంపై కేంద్రాన్ని కూడా ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సుజనా చౌదరితో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కొంతమంది భేటీ అయ్యారని విషయంపై వైసీపీ అధిష్టానం చాలా సీరియస్ గానే ఉందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: