వైసీపీ అతి పెద్ద పార్టీ. ఏపీలో చూసుకుంటే అంత పెద్ద పార్టీ మరోటి లేదు. ఇక జనాదరణకు లోటు లేదు. రేపటి రోజుల స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినా కూడా వైసీపీదే విజయం అన్న సర్వేలు ఉన్నాయి. విపక్షాలు  తొలి ఏడాది పెర్ఫార్మెన్స్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాయి. రెండవ ఏడాది కి కరోనా వచ్చి అసలు ఎక్కడా  కదలనీయడంలేదు.

 

మొత్తంగా చూస్తే ఏపీ పొలిటికల్ మైదానంలో వైసీపీ అటూ ఇటూ నిలబడి చెడుగుడు ఆడేస్తోంది. ఇంతలోనే ఆ పార్టీలో భారీ కుదుపు, ఒక ఎంపీ, నర్సాపురం నుంచి తొలిసారి గెలిచిన రఘురామ క్రిష్ణంరాజు వైసీపీకి అతి పెద్ద తలనొప్పిగా మారారు. ఆయన జగన్ మీద ఇండైరెక్ట్ గా విమర్శలు చేస్తున్నారు. పార్టీ మీద ఏకంగా విరుచుకుపడుతున్నారు.

 

ప్రభుత్వ పధకాలను తప్పుపడుతున్నారు. పార్టీఎలో అందరి దారి ఒకటైతే తన దారి వేరు అంటున్నారు. ఆయన మీద వైసీపీ నాయకత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దాని చట్టబద్ధతనే ఇపుడు రాజు గారు ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి ఉండడం ఏంటని కూడా నిలదీస్తున్నారు. లాజిక్ పాయింట్ తీస్తున్నారు.

 

ఆయన ఎన్నికల సంఘం వద్దకు వెళ్ళి మరీ దీని మీద క్లారిటీ కోరుతున్నారు. అదే సమయంలో వైసీపీ సర్కార్ నుంచి తనకు ముప్పు పొంచి ఉందని తనకు రక్షణ కల్పించాలని కూడా కోరుతున్నారు. కేంద్ర మంత్రులను కూడా ఆయన కలవబోతున్నారు. మొత్తానికి చూస్తూంటే జగన్ మంచివారు, ఆయన పట్ల తనకు గౌరవం ఉంది అంటూనే చేయాల్సింది అంతా చేస్తున్నారు. ఒకే ఒక్కడుగా రాజుగారు వైసీపీలో పెట్టిన కలితో ఇపుడు ఫ్యాన్ పార్టీకే ఉక్కబోత పట్టుకుంది. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి. ఏదేమైనా రచ్చ రచ్చ గానే సీన్ కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: