సెంటిమెంట్.. దీన్ని చాలా మంది నమ్ముతారు. తమ జీవితంలోనూ అనేక సెంటిమెంట్లు పాటిస్తారు. ఇక సినిమా, పాలిటిక్స్ రంగాల్లో సెంటిమెంట్లకు అంతూ పొంతూ ఉండదు. అయితే ఈ సెంటిమెంట్లు కూడా మరీ అంత గుడ్డిగా ఉండవు. వాటికీ లాజిక్ ఉంటుంది మరి. ఉదాహరణకు నారా చంద్రబాబు సీఎంగా ఉన్న 1995-2004 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరవు కాటకాలు విజృంభించాయి.

 

 

అసలు వర్షాలే కురవలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వరుస కరువులతో రాష్ట్రం అల్లల్లాడిపోయింది. ఆ తర్వాత 2004లో వైఎస్ తొలిసారి సీఎం అయ్యాక కుండపోతగా వానలు కురిశాయి. 2009లోనూ అంతే.. ఓ దశలో శ్రీశైలం బ్యారేజీ ఉంటుందా కొట్టుకుపోతుందా అన్నంతగా వర్షాలు వచ్చాయి. అప్పట్లో అంతా వైఎస్‌ లెగ్గు మహిమ అంటూ కాంగ్రెస్ నాయకులు మురిసిపోయారు.

 

 

ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా అదే అంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పాదం మోపిన వేళ వర్షాలు సకాలంలో కురిసి రైతులు పంటలు సకాలంలో వేసుకోగులుతున్నారని వ్యవసాయ మంత్రి కన్నబాబు కామెంట్ చేసేశారు. రైతులకు పెండింగులో ఉన్న బీమా సొమ్మును జగన్ విడుదల చేసిన సందర్భంగా మంత్రి ఈ కామెంట్ చేశారు. తాము గ్రామాలలో పర్యటించినప్పుడు ,రైతులు ఎంత సంతోషంగా ఉంది తమకు కనిపిస్తోందని ఆయన అన్నారు.

 

 

అంతే కాదు.. కరోనా సంక్షోభ సమయంలో కూడా ప్రస్తుత పథకాలకే కాకుండా పాత బకాయిలకు కూడా డబ్బులు ఇస్తుండడం గమనించి రైతులు ఆశ్చర్యపోతున్నారని కన్నబాబు అంటున్నారు. రైతు బాంధవుడుగా ముఖ్యమంత్రిని ప్రజలు భావిస్తున్నారని కన్నబాబు మురిసిపోతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: