విధి ఆడే వింత నాటకం ఎప్పుడు ఎలా ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అందుకే  బతికంతకాలం ఆనందంగా బతకాలి అంటారు. చావు ఎప్పుడు అటువైపు నుంచి వస్తుందో తెలియదు. కొంతమంది జీవితం మీద విరక్తితో ఆత్మహత్యలు చేసుకుంటే మరికొంతమంది ఆక్సిడెంట్ లు అయి చనిపోతారు. అప్పటిదాకా కళ్ళముందు ఆరోగ్యంగా కనిపించిన వారు హఠాత్తుగా కళ్ళముందే చనిపోతారు. జీవితము ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు. అలా ఊహించని రీతిలో చనిపోతే వారి మరణమే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాంటి ఒక మరణమే కేరళ లో చోటుచేసుకుంది జీవితంలో ఎం కష్టం వచ్చిందో ఏమో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని చివరికి ఆక్సిడెంట్ లో చనిపోయింది ఓ వివాహిత. 

 

 

వివరాల్లోకి వెళితే.. కేరళలో ని అలప్పుజా జిల్లా తన్నీరుమొక్కం‌కి చెందిన రాఖీ(32) అనే వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో కాలిపోతున్న రాఖీని చూసిన కుటుంబ సభ్యులు మనట్లు ఆర్పీ ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. ఎలాగైనా బతికించాలని కొచ్చి లోని చేర్తాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించేందుకు చూసారు. కానీ అక్కడ ఎవరూ చేర్చుకోకపోవడంతో అలప్పుజా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లో బయల్దేరారు. ఆమె బతకడం విధి కి నచ్చలేదో ఏమో ఆమెను తీసుకెళ్తున్న అబులెన్స్ ఆక్సిడెంట్ కు గురైంది. 

 

 

జాతీయ రహదారి 66పై వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ఎదురుగా వస్తున్న ఇసుక లారీని ఢీకొట్టింది. అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో రాఖీ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తండ్రి, మామకి గాయాలవడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. రాఖీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సమీపంలోని తురవూర్ తాలూకా ఆస్పత్రికి తరలించారు. చివరికి ఆమె ఆత్మహత్య చేసుకోవాలి అన్న ప్రయత్నం ఆక్సిడెంట్ రూపంలో వచ్చి ఆమె ప్రాణాలు తీసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: