జూన్ 30 తో దేశంలో అన్ లాక్ 1.0 ముగియడంతో అన్ లాక్ 2.0 ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇకపోతే అన్ లాక్ 1 0 తో పోలిస్తే అండ్ లాక్ 2.0 పెద్దగా మార్పులేమీ ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు విజృంభిస్తుండడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు వచ్చే నెల 15 వరకు రద్దు చేస్తున్నట్లు విమాన శాఖ తెలియజేసింది. అలాగే రైల్వే శాఖ కూడా ఇలాంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకు వచ్చింది. ముందు ముందుగా రెగ్యులర్ రైళ్లను నడపలేమని రైల్వే బోర్డు అభిప్రాయం తెలియజేసింది.

IHG

 


ఇంకోవైపు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆగస్టు నెల వరకు విద్యాసంస్థలు తెరిచే అవకాశం లేదని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ స్పష్టంగా తెలియజేశారు. దీనితో యాజమాన్యానికి వీలైతే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని తెలియజేశారు. దేశంలోనే పెద్ద విద్యాసంస్థలను ఐఐటీ లతో పాటు, ప్రవేట్ స్కూల్ వారి అన్ని యాజమాన్యాల ఆన్లైన్ క్లాసులు కొనసాగింపుకు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేశారు. మరోవైపు సిబిఎస్సి 10, 12 తరగతుల పరీక్షలు కూడా రద్దు చేసింది.

 

IHG

అలాగే మరోవైపు మహానగరాలలో ఉండే మెట్రో సర్వీసులు కూడా ఇప్పుడిప్పుడే మొదలుకావడం సురక్షితం కాదని అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు. ఇక దీంతో అన్ లాక్ 1.0 తో పోలిస్తే అన్ లాక్ 2.0 లో పెద్దగా మార్పులేమీ ఉండవు. మరోవైపు దేశంలో ఇప్పటివరకు ఐదు లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసులతో ప్రపంచంలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: