నిన్నటి వరకు ఒక లెక్క ... నేటి నుంచి మరో లెక్క అన్నట్టుగా తయారయ్యింది నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పరిస్థితి. అసలు పార్టీతో తనకు సంబంధం లేదన్నట్లుగా, ఆ పార్టీ అగ్రనేతలపైన, విధివిధానాలపై ప్రశ్నించడమే కాకుండా, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు లేదని, ఆ పార్టీ ఇది కాదని, తనకు ఇచ్చిన నోటీసులు చెల్లవని, ఎన్నో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నిన్ననే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా వైసీపీ పై అనేక ఫిర్యాదులు చేశారు. త్వరలోనే వైసీపీ రద్దు కాబోతోంది అంటూ ప్రకటించి సంచలనం రేపారు. తాజాగా ఈ రోజు కూడా ఢిల్లీలోని అనేక మంది అగ్ర నేతలను కలుస్తూ, ఏపీ రాజకీయ వ్యవహారాల గురించి, వైసీపీ గురించి అనేక ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయినా రఘురామకృష్ణరాజు ఆశించినంత స్థాయిలో స్పందన ఢిల్లీలో లభించడం లేదని తెలుస్తోంది. 

 

IHG


ఈ మేరకు జగన్ ఢిల్లీ స్థాయిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి చక్రం తిప్పినట్లు సమాచారం. రఘురామకృష్ణంరాజు లోక్ సభ స్పీకర్ తో పాటు, అనేకమంది పెద్దలను కలిసినా, వారు వైసీపీ ని విమర్శించే విధంగా ఎక్కడా, ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని , కేంద్ర మంత్రులు కూడా ఇదే రకంగా వ్యవహరించడంతో రఘురామకృష్ణంరాజు కు అసలు విషయం బోధపడిందట. ముఖ్యంగా బిజెపి కేంద్ర పెద్దలు జగన్ విషయంలో సానుకూలంగా ఉన్నారని, భవిష్యత్తులో వారికి వైసీపీతో చాలా అవసరాలు ఉండడంతో జగన్ తో వివాదం పెట్టుకునేందుకు బిజెపి అధిష్టానం పెద్దలు సాహసం చేయడం లేదట. 

IHG


అదీ కాకుండా లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా, రాజ్యసభలో ఆరో అతిపెద్ద పార్టీగా ఉండడంతో, బిజెపికి వైసీపీతో చాలా అవసరాలు ఉన్నాయి. అందుకే రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో బిజెపి పెద్దలెవరూ  సానుకూలంగా స్పందించడం లేదట. అదీ కాకుండా అవసరమైన సందర్భాల్లో కేంద్రానికి సహకరిస్తూ వస్తుండడంతో, కేవలం ఒక్క ఎంపీ కారణంగా జగన్ తో వైరం పెట్టుకుంటే రాజకీయంగా దెబ్బ తింటాము అనే ఆలోచనలో ఉన్న కేంద్రం రఘురామకృష్ణంరాజు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదట. ఈ విషయాలు రఘురామకృష్ణంరాజు కు కూడా బాగా అర్థం కావడంతో కాస్త వెనక్కు తగ్గి, జగన్ అంటే తనకు గౌరవమని, మొత్తం విజయసాయిరెడ్డే ఈ వివాదానికి కారణం అన్నట్టుగా ఆయనపై నెపాన్నినెట్టివేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: