దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనా వైరస్ సాధారణ ప్రజలనే కాదు వైద్యులనూ వెంటాడుతోంది. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది కరోనాకు టార్గెట్ అవుతన్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు ఎంతగా కష్టపడుతున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఈ కరోనా మహమ్మారి వల్ల పోలీలసులు చనిపోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక తెలంగాణలో కరోనా వైద్య సిబ్బందిని దారుణంగా వెంటాడుతుంది.  పేట్ల బురుజు ఆసుపత్రిలో 30 మందికి పైగా కరోనా ఇన్ఫెక్షన్‌కు గురి కాగా.. ఉస్మానియా డెంటల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూరిండెంట్‌‌లకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

IHG

నిమ్స్ ఉస్మానియా మెడికల్ కాలేజీల్లో కూడా మెడికోలకు వైరస్ సోకుతోంది. ఈ మద్యనే ఖైరతాబాద్‌లో ఓ డాక్టర్ కరోనా సోకి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు కరోనా సోకింది. దీంతో మరో రెండు రోజులపాటు ఆపరేషన్లు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి ఆర్ఎంవో మల్లికార్జునప్ప వెల్లడించారు. ఈ మద్యనే  ఇద్దరు వైద్యులతో పాటు 9 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  దాంతో ఇక్కడ ఇతర సిబ్బంది కరోనా భయంతో వణికిపోతున్నారు. దాంతో అప్రమత్తమైన ఆసుపత్రి అధికారులు తాత్కాలికంగా ఇన్ పేషేంట్స్ వార్డును, ఆపరేషన్లను నిలిపివేశారు.

IHG

ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్ సేవలు నిలిపివేస్తున్నట్లు స్పష్టంచేశారు. ఓపీలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని చెప్పారు. మరోవైపు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో పనిచేసే ముగ్గురు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గాంధీ ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ పీఏ, అసిస్టెంట్ పీఏ, నర్సుకు కరోనా సోకింది.  ఆదిలాబాద్‌లో రిమ్స్ స్టాఫ్ నర్సుకు కూడా కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆమె నివాసం ఉంటున్న కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: