ఢిల్లీలో క‌రోనా కట్ట‌డికి సీఎం కేజ్రీవాల్  ప్ర‌భుత్వం ఐదు ఆయుధాల‌తో ఎదుర్కొన‌బోతోందంట‌.ఆసుపత్రుల్లో పడక గదుల సంఖ్యను పెంచడంతో పాటు కరోనా వ్యాధి చికిత్సలో భాగంగా ఐసోలేషన్, పల్స్ ఆక్సిమీటర్లు, ఆక్సిజన్ సాంద్రతలు, ప్లాస్మా థెరపీలతో పాటు సర్వే, స్క్రీనింగ్ పద్ధతులను పాటిస్తు‍న్నట్లు  ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ తెలిపారు.శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కరోనా నియంత్ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు.లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే కరోనా కేసులు పెరుగుతాయని ముందే అంచనా వేశాం. కానీ అంచనాకు మించి కేసులు పెరిగాయి. దీంతో కరోనాను అరికట్టేందుకు మా ముందు రెండే మర్గాలు ఉన్నాయి. తిరిగి లాక్‌డౌన్‌ను విధించడం లేదా కరోనాతో యుద్దం చేయడం. ఇక ప్రజలక కోరిక మేరకు లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

 

 ఢిల్లీలో టెస్టింగ్‌ సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచామని వెల్లడించారు. ఢిల్లీలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతున్నా ఆందోళన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. వారంరోజులుగా ఢిల్లీలో స్వల్ప లక్షణాలతో కూడిన కరోనా కేసులు పెరుగుతున్నాయని, కేవలం 6000 కోవిడ్‌ బెడ్‌లనే వాడుతున్నామని, ఇంకా 13,500 బెడ్లు ఖాళీగా ఉన్నాయని కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు.ఐసోలేషన్‌.. ఇందుకోసం తమ ప్రభుత్వం రాష్ట్రంలోని పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కోవిడ్‌-19 బాధితుల కోసం కనీసం 40 శాతం బెడ్‌లను కేటాయించిన‌ట్లు చెప్పారు. హోటల్స్‌ను కూడా కరోనా కేందద్రాలకు కేటాయించడంతో ఇప్పుడు బెడ్‌ల సంఖ్య 13,500కు  చేరుకుంద‌ని తెలిపారు.

 

ఇదిలా ఉండ‌గా క‌రోనాను అదుపులోకి తీసుకురావాలంటే నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌ను పెంచ‌డం త‌ప్పా వేరే మార్గం లేద‌ని భావించిన  రాష్ట్ర ప్ర‌భుత్వం అందుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. జులై 6 నాటికి ఢిల్లీలోని ప్రతి ఇంటికి కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కంటైన్మెంట్‌ జోన్లలోని ప్రతి ఇంటిలో తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ప్రకటించిన విష‌యం విదిత‌మే.  ప్ర‌స్తుతం ఢిల్లీలో ప్రతిరోజూ 2,500లకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా దాదాపు 75 మరణాలు చోటుచేసుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: