కొందరు నాయకులు అత్యుత్సాహంతో మాట్లాడతారో.. ఏమో కానీ..అనవరసర వివాదాలకు ఆస్కారం ఇస్తుంటారు. ఏపీ సీఎం జగన్ కేబినెట్ మంత్రుల్లో కాస్త డీసెంట్‌గా ఉండేవారిలో గౌతంరెడ్డి ఒకరు. ఆయన తరచూ మీడియా ముందుకు రారు. సవాళ్లు, ప్రతిసవాళ్లు, సెటైర్లు వంటి వాటికి దూరంగా ఉంటూ రాముడు మంచి బాలుడు అన్న తరహాలో ఉంటుంటారు.

 

 

కానీ ఆయన తాజాగా ఓ నేషనల్ మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి. అదేంటంటే.. కరోనా ప్రమాదాన్నిజగన్ సర్కారు అందరికంటే ముందుగానే గ్రహించిందట. ఎంత ముందుగా అంటే డిసెంబర్‌లోనే కనిపెట్టేసిందట. అప్పటికి ఇండియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు మరి.

 

 

మరి జగన్ సర్కారు ఎలా కనిపెట్టిందంటారా.. విశాఖలోని ఏపీ సర్కారు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన మెడ్‌టెక్ ఉంది కదా. అందులో వైద్యపరికరాల తయారీ పార్క్ చీఫ్ సైంటిస్టు ఒకాయన ముందే హెచ్చరించాడట. ప్రమాదం రాబోతోంది అని చెప్పాడట. ఆ వెంటనే జగన్ సర్కారు నిధులు విడుదల చేసి ల్యాబులు, టెస్టులపై యాక్షన్ ప్లాన్ రూపొందించారట. వాస్తవానికి జగన్ సర్కారు కరోనాపై బాగానే యాక్షన్ తీసుకుంటోంది.

 

 

కరోనా కట్టడి విషయంలో కాస్త ఆలస్యంగా మేలుకున్నా.. జగన్ సర్కారు వేల సంఖ్యలో టెస్టులు చేయిస్తోంది. ఈ సంఖ్యలో దేశంలోనే టాప్ స్టేట్స్ లో ఏపీ ఉంది. కానీ ఇప్పుడు యాంటీ వైసీపీ గ్రూపులు ఈ మంత్రిగారి స్టేట్ మెంట్ ఆధారంగా రెచ్చిపోతున్నాయి. ట్రోలింగ్ కు దిగుతున్నాయి. మరి మంత్రిగారు అలా ఎందుకో చెప్పారో.. ఏమో..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: