ఇటీవల కరోనా వైరస్ బారినపడి శ్రీకాకుళం జిల్లా పలాస లో ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి అంత్యక్రియలు అధికారులు నిర్వహించిన తీరుపై ప్రజలలో మరియు రాష్ట్రంలో పెను దుమారమే రేగుతోంది. ఒకపక్క ప్రభుత్వాలు వైరస్ బారిన పడిన వారిని సమాజానికి దూరంగా పెట్టకండి మన పోరాడాల్సింది వ్యాధితో గాని రోగితో కాదు అంటూ చెబుతూనే మరోపక్క స్వయంగా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు మానవత్వానికి చోటులేకుండా శ్రీకాకుళం జిల్లా పలాస లో కరోనా వైరస్ సోకి చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని అంత్యక్రియలు నిర్వహించడానికి మున్సిపల్ సిబ్బంది జనాలంతా చూస్తుండగా ఓ ప్రొక్లెయిన్‌లో శవాన్ని తీసుకుని వెళ్లి పడేశారు.

IHG's Body ...

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన చూసి చాలా మంది నెటిజన్లు ప్రభుత్వాలు కూడా మానవత్వం లేకుండా ఆలోచిస్తున్నాయి అని మండిపడుతున్నారు. ఆ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంతో ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు  తీసుకోవాలని కలెక్టర్లకు వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

IHG

దీంతో మానవత్వం లేకుండా వ్యవహరించినందుకు సిబ్బందిపై వేటు వేసింది.. పలాస మున్సిపల్‌ కమిషనర్ టి.నాగేంద్ర కుమార్ , శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్.రాజీవ్‌ను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్ జె.నివాస్. ఇదే స‌మ‌యంలో.. సోంపేట పరిధిలోని కోర్టు వీధిలో ట్రాక్టర్ పై మహిళ మృతదేహం తీసుకెళ్లిన ఘటనపై విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా ఓ వీడు మరణాలకు సంబంధించి ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రతి ఒక్కరు పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: