జగన్ అదిరిపోయే మెజారిటీతో గెలిచి, అధికార పీఠం అధిరోహించి ఏడాది దాటేసింది. ఈ ఏడాది కాలంలో జగన్ పాలనకు మంచి మార్కులే పడుతున్నాయి. అద్భుతమైన పథకాలు అందిస్తుండటంతో ఇంకా మెజారిటీ ప్రజలు జగన్ వైపే ఉన్నారు.ఈ విషయం తాజాగా వచ్చిన సి‌పి‌ఎస్ సర్వేలో కూడా స్పష్టమైంది. అసలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జగన్‌దే అధికారమని చెబుతుంది.

 

అయితే ఇక్కడవరకు అంతా బాగానే ఉంది. కానీ జగన్ పాలన పట్ల ఎక్కువ మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నది...రూరల్ జనమే అని రాజకీయ విశ్లేషుకులు చెబుతున్నారు. అసలు జగన్ మొదటి ఆరు నెలల పాలనలో, టీడీపీ చేసిన నెగిటివ్ ప్రచారం కావొచ్చు, జగన్ తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాలు ప్రజలకు అర్ధంకాకపోవడం వల్ల కావొచ్చు...అప్పుడు జగన్‌పై అన్నీ వర్గాల ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు కనిపించింది.

 

కానీ జగన్ తీసుకున్న నిర్ణయాలు నిదానంగా అర్ధం కావడం, ఊహించని విధంగా పథకాలు అందించడంతో రూరల్ ప్రజల వాయిస్ మారుతూ వచ్చింది. చెప్పిన సమయానికి చెప్పిన విధంగా జగన్ సంక్షేమ పథకాలు అందించడంతో రూరల్ ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. ఈ పథకాల వల్ల వారికి ఏదొకరూపంలో డబ్బులు కనిపిస్తూనే ఉన్నాయి. దీని వల్ల రూరల్‌లో వైసీపీకి ఇంకా ప్లస్ అయింది.

 

ఇదే సమయంలో రూరల్‌తో పోల్చుకుంటే పథకాలు తక్కువగా అందే అర్బన్ ప్రజలు జగన్ పాలన పట్ల పెద్దగా సంతృప్తిగా వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. జగన్ ఈ ఏడాది కాలంలో ఎక్కువగా సంక్షేమ పథకాల మీదే ఫోకస్ చేసి, అభివృద్ధిని కాస్త పక్కనబెట్టడం అర్బన్ ప్రజల్లో అసంతృప్తికి కారణమైందని తెలుస్తోంది. పైగా ఇప్పటివరకు రాష్ట్రానికి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి రాకపోగా, గతంలో వచ్చిన సంస్థలు వెళ్లిపోయాయి. దీని వల్ల నగరాల్లో అభివృద్ధి పెద్ద స్థాయిలో జరగలేదు. కానీ రానున్న రోజుల్లో జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలు చేసి, ఇంకా కొత్త పెట్టుబడులు తెచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, అర్బన్ ప్రజల్లో కూడా ఎక్కువ శాతం సంతృప్తి వ్యక్తం అయ్యేలా చేసే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: