హాంకాంగ్ ఉన్న ప్రత్యేక పతిపత్తిని  చెడగొడుతూ  చైనా ఎన్నో రోజుల నుంచి దాష్టీకానికి దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారిపోయింది. హాంగ్ కాంగ్ భద్రత చట్టాన్ని నిన్నటి నుంచి అమలులోకి తీసుకొచ్చింది అమెరికా ప్రభుత్వం. హాంకాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని తుంగలో తొక్కుతూ చైనా చేస్తున్నటువంటి దాష్టీకానికి వ్యతిరేకంగా అమెరికా ఈ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధపడడం దీనికి  అంగీకరించడం కూడా జరిగిపోయింది. అయితే అమెరికా తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల హాంకాంగ్ కు ఎలాంటి ఉపయోగం ఉంది అన్నది చాలామందికి తెలియదు. 

 


 అమెరికా తీసుకొచ్చిన హాంకాంగ్ భద్రత చట్టం కారణంగా.. చైనాకు రాబోయే రోజుల్లో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనాలో ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్న విషయం తెలిసిందే. అయితే చైనాలో కంపెనీని స్థాపించినప్పటికీ ఆ కంపెనీల హెడ్క్వార్టర్స్ మాత్రం హాంకాంగ్ లోనే ఉంటుంది. హాంగ్ కాంగ్ లో ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టవు  ఎందుకంటే హాంకాంగ్ ప్రత్యేక ప్రతిపత్తి గల దేశం అయినప్పటికీ ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టిలో చైనా దేశం కిందికే వెళ్ళిపోతుంది. అయితే ప్రస్తుతం అమెరికా తీసుకొచ్చిన హాంకాంగ్ భద్రత చట్టం ప్రకారం.. హాంకాంగ్ కి ప్రత్యేక ప్రతిపత్తి కొనసాగి అక్కడ ఇంటర్నేషనల్ కంపెనీ లు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. 

 


 అయితే ప్రస్తుతం చైనాలో అన్ని రకాల వసతులు కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఉన్నాయి. కానీ ప్రస్తుత అమెరికా చెప్పింది కదా అని హాంకాంగ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందడుగు వేసినప్పటికీ ప్రస్తుతం చైనా లో ఉన్నటువంటి వసతులు  హాంకాంగ్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి తమ వ్యాపారం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అని వ్యాపారస్తులు ఆలోచిస్తున్నారు, అయితే ప్రస్తుతం హాంకాంగ్ భద్రత చట్టం తీసుకురావడం వల్ల ఒక్కసారిగా చైనా పై ప్రభావం చూపదు  కానీ క్రమక్రమంగా మాత్రం చైనాలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు తక్కువ అవుతారని హాంకాంగ్ లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎక్కువ అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: