ప్రస్తుతం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే, వైసిపి పార్టీ నుంచి ఎంపీగా  గెలిచినప్పటికీ సొంతపార్టీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు... అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ముందుకు సాగడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో... వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రఘురామకృష్ణంరాజు షోకాజ్ నోటీసులు జారీచేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే, అయితే ప్రస్తుతం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశం ఎక్కడ వరకు వెళుతుంది అన్నది ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనం గా మారిపోయింది. 

 


 ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు అటు టీడీపీ తో కానీ ఇటు బీజేపీ తో టచ్లో ఉన్నారని త్వరలో ఏదో ఒక పార్టీ లోకి వెళ్లి పోతున్నారు అని ఒక వాదన కూడా వినిపిస్తోంది. అయితే రఘురామకృష్ణంరాజు చెబుతున్నది ఏమిటంటే తనను  ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్టించుకోవడం లేదని ఒక వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు మాటలతో అటు టిడిపి వైపుకు ఇటు వైసీపీ వైపు రాకుండా తటస్థంగా ఉన్న చాలామంది వైసీపీ వైపు రాకుండా అయిపోతున్నాను అని అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎంపీ అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడడంతో పార్టీ విస్తరణ కూడా కాస్త కష్టతరం అవుతుంది అంటున్నారు,

 

మరోవైపు రఘురామకృష్ణంరాజు తనపై వైసీపీ పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రస్తుతం హస్తినలో చర్చలు  మొదలుపెట్టారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేవనెత్తిన అంశం అధినేత జగన్మోహన్రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను పట్టించుకోవడంలేదని కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని అంటూ వాదనలు వినిపించారు. అయినప్పటికీ తాను పార్టీ మారను ఈ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు అంశం ఆంధ్ర రాజకీయాలు మరింత చర్చనీయాంశంగా మారుతోంది రోజురోజుకీ

మరింత సమాచారం తెలుసుకోండి: