జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అనుభవం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పని అయిపోయింది ఒక ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి పదవి లో కూర్చున్నాడు ఇలా అనేక రకాల విమర్శలు చేయడం జరిగింది. సరిగ్గా జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఏడాది అయిన తరుణములో సంవత్సరం పరిపాలన విషయములో జగన్ తీసుకున్న నిర్ణయాలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు అదేవిధంగా కరోనా వైరస్ ని ఎదుర్కొంటున్న విధానానికి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. ఏకంగా బ్రిటన్ మంత్రి వైయస్ జగన్ పరిపాలన చాలా అద్భుతం అని...మహమ్మారి కరోనా ని ఎదుర్కొనే విషయం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గ్రామ వాలంటీర్ వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా అని బ్రిటన్ లో కూడా ఇదే వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నట్లు ఇటీవల తెలపడం జరిగింది.

 

ఇదే తరుణంలో ఒకనొక టైమ్ లో తెలుగుదేశం పార్టీకి  క్లోజ్ గా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న కొద్ది జగన్ ప్రభుత్వం పై రోజురోజుకీ పొగడ్తల వర్షం కురిపిస్తుండటం అందరికి షాక్ ఇస్తోంది. గతంలో కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ ఆమ్ ఆద్మీ నాయకులు జగన్ చాలా ముందుచూపు ఉన్న నాయకుడు అని, దేశంలో అటువంటి నాయకుడు ఇప్పటివరకు ఎవరూ లేరని కామెంట్ చేయడం జరిగింది.

 

ఇదిలా ఉండగా తాజాగా ప్రభుత్వ పాఠశాలల విషయంలో జగన్ 'నాడు నేడు' కార్యక్రమం గురించి ఢిల్లీ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో గతంలో తమకు అనుకూలంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఏకంగా వైయస్ జగన్ ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిపించడం టీడీపీ సైతం తట్టుకోలేకపోతున్నాట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. కాగా ఉన్న కొద్దీ వైఎస్ జగన్ క్రేజ్ రోజు రోజుకి జాతీయస్థాయిలో పెరుగుతున్న తరుణంలో… భవిష్యత్తులో ప్రధాని పీఠాన్ని జగన్ అధిరోహించే అవకాశం ఉందని కొంతమంది మేధావులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: