పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస రావు ఈ ముగ్గురు బేటీ కావడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా బయటకు రావడంతో తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మొదటి నుంచి వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఈ వీడియో బలం చేకూర్చినట్టు అయిందని, అనవసరంగా ప్రజల్లో అనుమానాలు పెరిగిపోయాయి అనే భావన ఇప్పుడు ఆ పార్టీ లో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆ వ్యవహారంతో తెలుగుదేశం పార్టీ కీలక నాయకులతో పాటు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన అందరి విషయంలోనూ ఏపీ, తెలంగాణ లలో నిఘా ఏర్పాటు చేశారనే విషయం అర్థం అయిపోయింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.

 

IHG

 తన కదలికలపైన పూర్తిస్థాయిలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు రెండూ నిఘా పెంచాయని, తనను ఎప్పుడు ఎవరెవరు తనను కలుస్తున్నారు అనే విషయాలపైన ఆరా తీస్తున్నారనే అనుమానం బాబు లో వ్యక్తం అవుతోందట. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో పదేళ్ళ పాటు ఉండే అవకాశం వచ్చినా చంద్రబాబు ఓటుకు నోటు కేసు వ్యవహారంలో చిక్కుకుని ఆకస్మాత్తుగా ఏపీకి వచ్చేసారు. హైదరాబాద్ కంటే ఏపీ బెటర్ అని డిసైడ్ అయిపోయారు. కానీ ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో, కక్షపూరితంగా వ్యవహరించే అవకాశం ఉందని, కరకట్ట నుంచి మళ్ళీ చంద్రబాబు హైదరాబాద్ కి మకాం మార్చి అక్కడే ఉంటున్నాడు.


 అక్కడే పార్టీకి చెందిన ప్రముఖులు, ఇంకా అనేకమంది కీలక వ్యక్తులను  చంద్రబాబు కలుస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు తెలంగాణ, ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేశాయనే అనుమానం చంద్రబాబు కు కలగడంతో మొత్తం అన్ని మీటింగ్ లను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో చంద్రబాబు ఈ తరహా మీటింగులు ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటారు. జాతీయ మీడియా ప్రతినిధుల నుంచి తనకు నమ్మకమైన, కీలకమైన వ్యక్తులు అందరిని ఆ రోజుల్లోనే కలుస్తూ ఉంటారు.


 కానీ ఎప్పుడైతే పార్క్ హయత్ హోటల్ సంఘటన జరిగిందో.. అప్పటి నుంచి తన కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా ఉందనే విషయం తెలుసుకుని చంద్రబాబు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. హైదరాబాదులో తనను కలిసేందుకు ఎవరు రావద్దని, ఇప్పటికే కీలకమైన వ్యక్తులందరికీ చంద్రబాబు చెప్పేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: