కాలం మారింది కానీ మనుషులు మాత్రం మారడం లేదు. కుమార్తె.. కుమారుడు మధ్య వ్యత్యాసం ఉండకూడదు అని అంటారు.. ఇప్పుడు ఉండటం లేదు అని అంటారు.. కానీ ఎక్కడో ఒక చోటా ఈ వ్యత్యాసం కనిపిస్తూనే ఉంది. ఇంకా ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కుమారుడు, కుమార్తెల మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. 

 

మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పూర్ జిల్లాలోని మాత్‌గావ్‌ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో ఉంటున్న మోతీలాల్ రాజ్‌పుత్ దంప‌తులు కుమారుడు కోసం ఏకంగా తొమ్మిది మందిని కుమార్తెలకు జన్మనిచ్చారు. అయితే కొడుకు కోసం అంతమందిని కనడం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు. ఏంటి అని అనుకుంటున్నారా? 

 

అదేనండి.. ఆ దంపతులకు కుమారుడు లేడు అనే ఓకే ఒక కార‌ణంతో వారి బంధువులు భూమిని ఆక్ర‌మించుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.  దీంతో వారు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. అయినప్పటికీ స‌మ‌స్య ప‌రిష్కారం అవ‌లేదు. దీనికితోడు మోతీలాల్ సోద‌రులు అత‌నిని దారుణంగా కొట్టారు. 

 

ఈ నేప‌ధ్యంలో మోతీలాల్ త‌న భార్య, ఐదుగురు కుమార్తెల‌తో పాటు ఎస్ఫీ కార్యాల‌యానికి చేరుకుని, త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయంపై అక్క‌డ ఫిర్యాదు చేశారు. ఇంకా ఈ నేపథ్యంలోనే మోతీలాల్ మాట్లాడుతూ త‌న‌కు, త‌న ఇద్ద‌రు సోద‌రుల‌కు వ్య‌వ‌సాయ భూమి ఉంద‌ని, త‌న‌కు కుమారులు లేక‌పోవ‌డంతో త‌న భూమి వాటాను త‌న సోద‌రులు లాక్కోవాల‌ని చూస్తున్నట్టు ఆరోపించాడు. దీంతో ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు మోతిలాల్ సోద‌రుల‌ను పోలీస్ స్టేష‌న్‌కు పిలిపించి, స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఏది ఏమైనా ఒక కొడుకు కోసం తొమ్మిది మంది ఆడపిల్లలను కనడం మాములు విషయం కాదు.                                       

మరింత సమాచారం తెలుసుకోండి: